బాబు గుండెల్లో బొత్స బాంబులు వేస్తున్నారా ?
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మంత్రి బొత్స సత్యనారాయణ చాలా ముందు ఉంటారు. ప్రత్యర్థులకు నిద్ర పట్టని రీతిలో ఆయన చేసే కామెంట్స్ ఉంటాయి. దాంతో ఆయన మైండ్ [more]
;
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మంత్రి బొత్స సత్యనారాయణ చాలా ముందు ఉంటారు. ప్రత్యర్థులకు నిద్ర పట్టని రీతిలో ఆయన చేసే కామెంట్స్ ఉంటాయి. దాంతో ఆయన మైండ్ [more]
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మంత్రి బొత్స సత్యనారాయణ చాలా ముందు ఉంటారు. ప్రత్యర్థులకు నిద్ర పట్టని రీతిలో ఆయన చేసే కామెంట్స్ ఉంటాయి. దాంతో ఆయన మైండ్ గేమ్ మాస్టర్ గా వైసిపి లో అనతికాలంలోనే గుర్తింపు పొందారు. తాజాగా బొత్స సత్యనారాయణ మరోసారి బాంబులు పేల్చి విపక్షాల రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి లోనే ఉండాలని పోరాడుతున్న చంద్రబాబు టార్గెట్ గా ఆయన కామెంట్స్ ను చూస్తున్నారు విశ్లేషకులు.
ఇంతకి బొత్స ఏమన్నారు …?
అమరావతి నుంచి రాజధాని ఏ క్షణం లో అయినా విశాఖ తరలి వెళ్లేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఇది బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్య. అయితే దీనికి షరతులు వర్తిస్తాయన్న రీతిలో న్యాయస్థానంలో ఈ అంశం పెండింగ్ లో ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. కోర్టు లో ఉన్నా కూడా రాజధాని ఎలా తరలించవచ్చన్న అంశం ఇప్పుడు వైసిపి పరిశీలిస్తున్నట్లు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల ద్వారా స్పష్టం అయ్యింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అండ్ కో స్పందన ఎలా ఉండబోతుందన్నది చూడాలి.
మే లో తరలించేస్తారని ప్రచారం …
స్థానిక ఎన్నికల్లో అపూర్వ విజయం తరువాత వైసిపి కి రాజధాని అంశంపై లైన్ క్లియర్ అయ్యింది. ఒకరకంగా ప్రధాన విపక్ష అధినేత చంద్రబాబు పదేపదే ఎన్నికల సభలో మూడు రాజధానులపై ఈ ఎన్నికలను రిఫరెండం అని చెప్పేశారు. దాంతో ప్రజా మద్దతుఉన్నదని పూర్తి క్లారిటీ వచ్చేశాక ఇక ఆగేది ఏముందన్నది అధికారపార్టీ ఆలోచనగా ఉంది. ఇక ఎంతోకాలం వేచి చుడాలిసిన పని లేదని ముందు తట్టా బుట్టా తరలించి మిగిలిన వ్యవహారాలు న్యాయ సమీక్షకు వదిలి పెట్టాలన్నది జగన్ బృందం వ్యూహంగా కనిపిస్తుంది . దానికి అనుగుణంగా బొత్స సత్యనారాయణ వంటి వారు పదునైన వ్యాఖ్యల బాణాలు వదులుతున్నట్లే కనపడుతుంది. మరి దీన్ని బాబు అండ్ కో ఎలా అద్దుకుంటారో చూడాలి.