మంత్రిగారి వ్యాఖ్యలు మంట పెడుతున్నాయా ?
వైసీపీ సర్కారులో కీలక మంత్రులుగా ఉన్నవారు.. కొందరు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని తరలింపుపై చేసిన సంచలన వ్యాఖ్యలు [more]
;
వైసీపీ సర్కారులో కీలక మంత్రులుగా ఉన్నవారు.. కొందరు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని తరలింపుపై చేసిన సంచలన వ్యాఖ్యలు [more]
వైసీపీ సర్కారులో కీలక మంత్రులుగా ఉన్నవారు.. కొందరు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని తరలింపుపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇదే తరహాలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఏ క్షణంలో అయినా పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మూడు రాజధానులపై కోర్టుకు వెళ్లి, అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. మూడు రాజధానులపై ఇప్పటికే చట్టం చేశామని.. కోర్టులో చిన్నచిన్న సమస్యలున్నాయని.. కోర్టును ఒప్పించి, మెప్పిస్తామని స్పష్టం చేశారు.
మంత్రి గారిపై కోర్టుకు…..
‘ఒక వర్గానికి, 20 గ్రామాలకే అమరావతి రాజధాని పరిమితం. సీఎం జగన్ 13 జిల్లాల అభివృద్ధి కోసమే విశాఖకు పరిపాలనా రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు“ అని బొత్స సత్యనారాయణ సెలవిచ్చారు.. అయితే.. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయని.. టీడీపీ నాయకులు అప్పుడే విమర్శల పర్వం ప్రారంభించారు.. మరికొందరు బొత్స సత్యనారాయణ ను కోర్టుకు ఈడ్చేందుకు కూడా ప్రణాళికలు రెడీ చేసుకున్నారు.
కోర్టు పరిధిలో ఉండటంతో…..
దీనికి రీజన్ ఏంటంటే.. ప్రస్తుతం అమరావతి రాజధాని అంశం.. కోర్టులో విచారణ పరిధిలో ఉంది. అలాంటి రాజధానిని తరలించే హక్కు ప్రభుత్వానికి లేదని.. పైగా కోర్టులో విచారణలో ఉన్న అంశంపై వివాదాస్ప ద వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ఇలాంటి విషయం మంత్రి బొత్స సత్యనారాయణ కి తెలిసికూడా వ్యాఖ్యానించడానన్ని తాము కోర్టు దృష్టికి తీసుకువెళ్తామని అంటున్నారు. దీంతో ఇప్పుడు బొత్స సత్యనారాయణ విషయం ఆసక్తిగా మారింది.
సొంత పార్టీలోనూ….
ఇక, సొంత పార్టీ వైసీపీలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల విషయంలో గతంలో ఓ సారి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పార్టీకి మైనస్ అయ్యాయి. ఇప్పుడు కూడా చేసేదేదో సైలెంట్‌గా చేసుకుంటూ… పోతున్న సమయంలో ఇలా వ్యాఖ్యానించడం ద్వారా.. రాజధాని ప్రజలను రెచ్చగొట్టటమే కకదా! ఇలా ఎందుకు వ్యవహరించాలి? అని సీనియర్లు గుసగుసలాడుతున్నారు. మరి బొత్స సత్యనారాయణ కు ఎలాంటి సెగ తగులుతుందో ? చూడాలి.