వైసీపీ ఎమ్మెల్యేపై అసహనం… టిక్కెట్ ఇవ్వొద్దంటూ?
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు నేతలు పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉంటే.. మరికొందరు వ్యాపారాలు చేసుకుంటూ.. బిజీగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా చాలా [more]
;
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు నేతలు పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉంటే.. మరికొందరు వ్యాపారాలు చేసుకుంటూ.. బిజీగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా చాలా [more]
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు నేతలు పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉంటే.. మరికొందరు వ్యాపారాలు చేసుకుంటూ.. బిజీగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా చాలా తక్కువ మందే వైసీపీ నేతలు.. ఇక్కడ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఎక్కువ మంది.. వ్యాపారాలు చేసుకుంటూ.. కాంట్రాక్టులు తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే ఇలా రెండేళ్లు గడిచిపోయాయి. దీంతో ఎవరెవరు.. ఏం చేస్తున్నారనే విషయంపై పార్టీ అధిష్టానం ఆరాతీస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు.. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను డమ్మీలను చేసి కీలక నేతలే చక్రం తిప్పేస్తున్నారు. పనితీర ఏ మాత్రం సరిగా లేని కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకంగా ఫిర్యాదులు వెళ్లడంతో అధిష్టానం ప్రత్యేకంగా రిపోర్టులు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.
నాన్ లోకల్ గా….
ఈ క్రమంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌పై ఫుల్లుగా యాంటీ రిపోర్టు వచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. “ఆయన లోకల్ మనిషే అయినా.. నాన్ లోకల్‌గా వ్యవహరిస్తున్నారు. ఎందుకు ఆయనకు టికెట్ ఇచ్చారో.. తెలియడం లేదు“ అని ఓ మంత్రి ఏకంగా.. కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత దుమారానికి దారితీస్తోంది. దీనికి ప్రదానంగా ఎమ్మెల్యే బుర్రా తన వ్యాపారాల్లో బిజీ గా ఉంటున్నారు . ఎక్కువ సమయం ఆయన బెంగళూరుకే పరిమితమవుతున్నారు. అంతేకాదు.. నియోజకవర్గానికి వస్తున్నా.. స్థానికంగా నేతలను కలుసుకునేందుకు సమయం కేటాయించడం లేదని.. ఏడాది కాలంగా ఆయనపై ఫిర్యాదులు వస్తున్నాయి. స్థానికంగా కొందరు నేతలను పెట్టుకుని వారికే పెత్తనం అప్పగించడంతో పార్టీ కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది.
గతంలోనూ అంతే…
2014 ఎన్నికల్లో కదిరి బాబూరావుపై ఓడిన బుర్రా మధుసూదన్ యాదవ్ ఐదేళ్లు నియోజకవర్గంలో యాక్టివ్‌గా లేరు. ఆయనకు సీటు ఇవ్వవద్దని.. రెడ్డలకే కనిగిరి సీటు ఇవ్వాలని జగన్‌పై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. అయితే జిల్లాలో యాదవులను సంతృప్తి పరచాల్సి ఉన్న క్రమంలోనే బుర్రా మధుసూదన్ యాదవ్ కు జగన్ సీటు ఇచ్చారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంపైనే కాదు.. పార్టీ కేడర్లోనూ ఇప్పటకీ పట్టు సాధించలేకపోయారు. ఇక రెడ్డి వర్గం నాయకులతో ఆయనకు రోజు రోజుకు సంబంధాలు క్షీణిస్తున్నాయంటున్నారు. దీంతో వాళ్లు ఎమ్మెల్యేపై జిల్లా మంత్రులకు, సలహాదారులకు ఫిర్యాదులే ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటివరకు అంతంత మాత్రంగానే ఉన్న ఈ పరిస్థితి ఇప్పుడు మరింత రగులుతోంది. దీంతో ఓ వర్గం పార్టీ నేతలు అయితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు టిక్కెట్ రానివ్వం అని ఘంటాపథంగా చెపుతున్నారు.
సమీక్షలక కూడా….?
ఇటీవల నియోజకవర్గ సమీక్ష సమావేశానికి కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ డుమ్మా కొట్టడం.. జిల్లా ఇంచార్జ్ మంత్రికి సైతం ఆగ్రహం తెప్పించిందని..దీనిపై ఆయన నేరుగా ప్రభుత్వ సలహాదారు.. వైసీపీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్.. సజ్జల రామకృష్ణా రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. దీనిపై స్పందించిన సజ్జల.. “ఈసారి ఎలాగోలా కానివ్వండి!' అనినర్మగర్భంగా వ్యాఖ్యానించారని.. పార్టీలో నేతలు గుసగుసలాడుతున్నారు. అంటే.. దీనిని బట్టి.. వచ్చే ఎన్నికల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ కు టికెట్ దక్కడం లేదనే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా చెబుతున్నారు. మరి ఎమ్మెల్యే ఇప్పటకి అయినా నియోజకవర్గంపై పట్టు సాధిస్తారో ? లేదో ? చూడాలి.