బెళగావి బీజేపీదే… అందుకే అంత ధీమా?
బెళగావి పార్లమెంటు కు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక ఇటు అధికార బీజేపీ, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. బెళగావి నియోజకవర్గం ఒకప్పుడు [more]
బెళగావి పార్లమెంటు కు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక ఇటు అధికార బీజేపీ, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. బెళగావి నియోజకవర్గం ఒకప్పుడు [more]
బెళగావి పార్లమెంటు కు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక ఇటు అధికార బీజేపీ, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. బెళగావి నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. అయితే గత నాలుగు దఫాలుగా ఇక్కడ బీజేపీ విజయం సాధిస్తుంది. వరస విజయాలతో ఊపు మీదున్న బీజేపీ ఈ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. అభ్యర్థుల నిర్ణయం ఇంకా జరగకపోయినా ఈ ఎన్నికను కాంగ్రెస్ మాత్రం ప్రతిష్టాత్మకంగా మారింది.
కాంగ్రెస్ కు కంచుకోట….
బెళగావి పార్లమెంటు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. అప్పటి నుంచి 1991వరకూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 1996లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఇక్కడ జనతాదళ్ అభ్యర్థి శివానంద్ హేమప్ప విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బెళగావి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వసంతరావు పాటిల్ పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. బెళగావిలో ఇదే కాంగ్రెస్ కు చివరి విజయమని చెప్పాలి.
పదిహేనేళ్ల నుంచి…..
ఇక 2004 నుంచి ఇక్కడ బీజేపీ అభ్యర్థి సురేష్ అంగడి విజయం సాధిస్తూ వస్తున్నారు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరస గెలుపులతో సురేష్ అంగడీ రికార్డు సృష్టించారు. అందుకే ఆయనకు బీజేపీ కేంద్ర మంత్రి పదవిని ఇచ్చింది. అయితే కరోనాతో సురేష్ అంగడీ మృతి చెందడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమయింది. బీజేపీ మరోసారి ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. నేతలు బెళగావిని తరచూ పర్యటిస్తున్నారు.
మళ్లీ బీజేపీదేనా?
ఇక్కడ సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే కురబ, లింగాయత్, బ్రాహ్మణ, వక్కలిగలు ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఒక సామాజికవర్గానికి చెందిన వారికే బీజేపీ టిక్కెట్ ఇచ్చే అవకాశముంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే టిక్కెట్ కేటాయిస్తామని బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సురేష్ అంగడి దాదాపు నాలుగు లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. బీజేపీకి పట్టున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ కాంగ్రెస్ కు పెద్దగా ఆశలేమీ లేవు.