Tdp : పెద్దిరెడ్డి ని ఎదుర్కొనే పట్టున్న నేత ఈయనేనట

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీరామారావు ఎందరికో అవకాశాలు కల్పించారు. వారిలో అనేక మంది నేటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. చంద్రబాబు చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత కొందరు [more]

;

Update: 2021-10-09 08:00 GMT

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీరామారావు ఎందరికో అవకాశాలు కల్పించారు. వారిలో అనేక మంది నేటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. చంద్రబాబు చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత కొందరు రాజకీయాల నుంచి తప్పుకోగా, మరికొందరు వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఇంకా కొన్ని కుటుంబాలు పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్నాయి. వారిని తిరిగి యాక్టివ్ చేసే పనిలో పడ్డారు చంద్రబాబు. పుంగనూరు నియోజకవర్గం ఇన్ ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి నియామకం చూస్తే ఇదే అర్థమవుతుంది.

ఇన్ ఛార్జిగా నియమించడంతో….

పుంగనూరు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబును చంద్రబాబు ఇన్ ఛార్జిగా నియమించారు. ఇప్పటి వరకూ పుంగనూరు వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న అనీషారెడ్డిని తప్పించి చల్లా బాబును నియమించారు. ఈ నియామకం వెనక చంద్రబాబు పెద్ద కసరత్తే చేశారంటున్నారు. ప్రధానంగా ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించాలన్నది చంద్రబాబు ఆలోచన. పెద్దిరెడ్డిని ఎదుర్కొనాలంటే గట్టి నేత కావాలని చంద్రబాబు చాలా కాలం నుంచి అన్వేషిస్తున్నారు.

చల్లా తండ్రి మాజీ ఎమ్మెల్యే….

దాదాపు నెల రోజుల క్రితం జరిగిన సమావేశంలోనూ మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డితో సంప్రదింపులు జరిపారు. అమర్ నాధ్ రెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించాలనుకున్నా ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో చల్లా రామచంద్రారెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించారు. చల్లా రామచంద్రారెడ్డి కుటుంబం టీడీపీలో క్రియాశీలకంగా ఉంటుంది. చల్లా రామచంద్రారెడ్డి తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరుపున పీలేరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా తెలిచారు. 1983, 1985లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత ఆ కుటుంబం రాజకీయంగా ఎటువంటి పదవులు పొందలేదు.

పట్టున్న నేత అని భావించి….

కేవలం రొంపిచర్ల ఎంపీపీగానే ఆ కుటుంబం పదవులను పొందింది. రొపించెర్ల మండలంలో ఈ కుటుంబానికి ఇప్పటికీ మంచి గుర్తింపు ఉండటం, పెద్దిరెడ్డి ని ఎదుర్కొనేందుకు చల్లా రామచంద్రారెడ్డి ధీటైన నేతగా చంద్రబాబు భావించారు. పెద్దిరెడ్డి వరసగా పుంగనూరు నియోజకవర్గంలో మూడు సార్ల నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అనీషారెడ్డిని పక్కన పెట్టి మరీ చల్లా రామచంద్రారెడ్డిని నియమించారు. వచ్చే ఎన్నికలలో పుంగనూరు నుంచి పోటీ పడబోయేది ఇద్దరూ రామచంద్రారెడ్డిలు కావడం విశేషం.

Tags:    

Similar News