సేన సై అంటున్నా.. డైలామాలో టీడీపీ…?

ఏపీ రాజకీయాలను చంద్రబాబు ఔపాసన పట్టేశారు అని అంతా అనుకున్నారు. తమ్ముళ్ళు కూడా అదే నమ్మారు. కానీ 2019 ఎన్నికల తరువాత బాబు మార్క్ పాలిటిక్స్ ఇక‌ [more]

;

Update: 2021-04-02 12:30 GMT

ఏపీ రాజకీయాలను చంద్రబాబు ఔపాసన పట్టేశారు అని అంతా అనుకున్నారు. తమ్ముళ్ళు కూడా అదే నమ్మారు. కానీ 2019 ఎన్నికల తరువాత బాబు మార్క్ పాలిటిక్స్ ఇక‌ చెల్లవు అని పక్కాగా తేలిపోయింది. 2024 ఎన్నికల నాటికి బాబు కొత్త ఎత్తులు వేయకపోతే జగన్ని తట్టుకుని టీడీపీ నావ తీరానికి చేరడం కష్టమని కూడా సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. మరి చంద్రబాబు ఏం చేస్తే టీడీపీకి అధికారం దక్కుతుంది అన్నదే ఇపుడు ప్రశ్న.

వారిని దువ్వుతారా ….?

ఏపీలో బీసీలు పెద్ద ఎత్తున ఉన్నారు. రాయలసీమ అయినా, కోస్తా చూసుకున్నా ఉత్తరాంధ్రా తీసుకున్నా బీసీలు అధికంగా ఉంటారు. వారు వందకు పైగా నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారు అని ఒక లెక్క కూడా ఉంది. ఇప్పటికే వారిని చంద్రబాబు దువ్వే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తన పార్టీ పదవులు అన్నీ కూడా వారికే ఇచ్చారు. కానీ బీసీలు మాత్రం వాటిని కాగితం పువ్వులుగా చూస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా ఈ పార్టీ పదవులు ఇపుడు ఎందుకు అన్నదే వారి అక్రోశం. దాంతో బీసీలను ఎంత దువ్వినా వర్కౌట్ కావడం లేదు. పైగా వారు వైసీపీ కి స్ట్రాంగ్ సపోర్టర్లు గా మారుతున్నారు.

కాపు కార్డుతోనైనా….?

ఇక ఏపీలో కాపుల సంగతి తీసుకుంటే వారు బలీయమైన శక్తిగా ఉన్నారు. అయితే కాపుల చూపు తమకూ ఒక నాయకుడూ పార్టీ ఉందంటూ జనసేన మీదనే పెట్టారు. పవన్ కళ్యాణ్ కి బలం పెంచాలని, ఏపీలో ఆయన్ని ఒక పవర్ ఫుల్ లీడర్ గా చూడాలని కాపు యువత భావిస్తోఅంది. మధ్య వయస్కులు వైసీపీ వైపు ఉంటే సీనియర్ సిటిజన్లు టీడీపీ అభిమానంతో ఉన్నారు. ఇలా కాపుల ఓట్లు సాలిడ్ గా ఒకే వైపు లేవు, చీలిపోయి ఉన్నాయి. అయితే ఆ ఓట్లు పోలరైజ్ కావాలంటే పవన్ చంద్రబాబు మళ్ళీ కలిస్తే సాధ్యమవుతుంది. గెలిచే కూటమి అని మొత్తానికి మొత్తం కాకపోయినా ఎక్కువ శాతం ఇటు వైపు టర్న్ అవుతారు.

కచ్చితంగా దెబ్బేనా …?

ఇక కాపుల మద్దతు విషయంలో పవన్ తో చేతులు కలపడానికి చంద్రబాబుకు అభ్యంతరాలు ఏవీ లేవు. పవన్ కూడా బీజేపీతో విసిగి ఉన్నారు. ఈ పొత్తు వల్ల ఉత్తరాంధ్రా జిల్లా నుంచి గోదావరి దాకా ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. అదే సమయంలో బీసీలు మాత్రం మరింతగా దూరం అవుతారు అన్న విశ్లేషణ కూడా ఉంది. కాపులను చంద్రబాబు చంకనెక్కించుకుంటే బీసీలు ఆ కొద్ది పాటి మద్దతు కూడా ఇవ్వకుండా నూరు శాతం వైసీపీ స్టాండ్ తీసుకుంటారని అంటున్నారు. దాంతో పవన్ తో చేతులు కలిపి బాహాటంగా పొత్తు గీతం ఆలపించేందుకు టీడీపీకి ఈ లెక్కలు అడ్డువస్తున్నాయట. కాపుల ఓట్ల కోసం కక్కుర్తి పడితే బీసీలను శాశ్వతంగా వైసీపీకి వదులుకోవాల్సి ఉంటుందని టీడీపీలోనే మరో చర్చ సాగుతోంది. ఈ విధంగా టీడీపీ సామాజికవర్గాల పరంగా కూడా స్టాండ్ తీసుకునే విషయంలో ఫుల్ డైలామాలో ఉందని అంటున్నారు. అదే సమయంలో జగన్ డేరింగ్ గా బీసీలకు జై అనేస్తున్నాడు. మరి చంద్రబాబు ఈ విషయంలో క్లారిటీకి వస్తే తప్ప టీడీపీ కి 2024లో సీన్ ఏంటి అన్నది తేలదు అంటున్నారు.

Tags:    

Similar News