రెండు తేదీలు – ఇద్దరు నేతలు

(ఉపోద్ఘాతం) (సూచన: ఇది ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర. చంద్రబాబు వీరాభిమానులతో ఇబ్బంది లేదు. రాజశేఖర్ రెడ్డి వీరాభిమానులతోనూ ఇబ్బంది లేదు. ఎటొచ్చి చంద్రబాబు వీరద్వేషులతోనూ, [more]

Update: 2020-09-03 00:30 GMT

(ఉపోద్ఘాతం)
(సూచన: ఇది ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర. చంద్రబాబు వీరాభిమానులతో ఇబ్బంది లేదు. రాజశేఖర్ రెడ్డి వీరాభిమానులతోనూ ఇబ్బంది లేదు. ఎటొచ్చి చంద్రబాబు వీరద్వేషులతోనూ, రాజశేఖర్ రెడ్డి వీరద్వేషులతోనే ఇబ్బంది. దయచేసి ఈ వీరద్వేషులు ఈ పోస్టులు చదవకండి.)
(ఈ ఇద్దరు నేతలను చూసిన అనేకానేకమంది జర్నలిస్టుల్లో నేను కూడా ఒకడిని. అప్పట్లో కంటే ఇప్పుడు ఈ ఇద్దరికీ వీరాభిమానుల కంటే వీర ద్వేషులు ఎక్కువ. కొందరికి చంద్రబాబు నాయుడుపై ఉండే అభిమానం కంటే రాజశేఖర్ రెడ్డిపై ఉండే ద్వేషం ఎక్కువ. అలాగే రాజశేఖర్ రెడ్డిపై అభిమానం కంటే చంద్రబాబు నాయుడిపై ద్వేషం ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఇద్దరినీ ఒకే సారి విశ్లేషించడం సాహసమే అవుతుంది. అయినా ఓ ప్రయత్నం.)
రెండు తేదీలు – ఇద్దరు నేతలు

(మొదటి భాగం)

ఒకటే నెల – సెప్టెంబర్.
ఒకటే ప్రాంతం – రాయలసీమ.
రెండు తేదీలు… సెప్టెంబర్ 1, 2.
ఇద్దరు నేతలు – చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి.
ఈ నెలకు (సెప్టెంబర్), ఈ తేదీలకు, ఈ ఇద్దరు నేతల జీవితాలకు ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విడదీయలేని సంబంధం ఉంది. ఈ ఇద్దరూ ఒకే ప్రాంతం (రాయలసీమ) నుండి రావడమే కాదు ఇంచుమించుగా ఒకే పార్టీ ప్రోత్సాహంతోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇంచుమించుగా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇద్దరికీ కాంగ్రెస్ నాయకత్వమే మార్గదర్శకం.
1977 ఎమెర్జెన్సీ కారణంగా దేశ రాజకీయాల్లో వచ్చిన పెనుమార్పులు ఫలితంగా కాంగ్రెస్ పార్టీ చీలిపోవడంతో రెండు (గడపలు) కాంగ్రెస్సులు రావడం, ఇద్దరూ చెరో గడప నుండి ప్రవేశించారు. అయితే ఇద్దరి రాజకీయం వేరు. ఇద్దరి ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు వేరు. అనుసరించిన మార్గాలు వేరు.

(మిగతా రెండో భాగం)

 

-గోపీ దారా సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News