అచ్చెన్నకు ప్రమోషన్… ఎమోషన్ ను వాడుకోవాలనే?

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పార్టీ సంగతి ఏమో తెలీదు కాని ఆయనకు మాత్రం వ్యక్తిగతంగా కలసి వచ్చినట్లే చెప్పాల్సి ఉంటుంది. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో దాదాపు [more]

Update: 2020-09-09 00:30 GMT

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పార్టీ సంగతి ఏమో తెలీదు కాని ఆయనకు మాత్రం వ్యక్తిగతంగా కలసి వచ్చినట్లే చెప్పాల్సి ఉంటుంది. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో దాదాపు రెండు నెలల పాటు రిమాండ్ లో ఉన్నారు. అయితే అచ్చెన్నాయుడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన 98 శాతం రిమాండ్ సమయాన్ని ఆసుపత్రిలోనే గడిపారు. ఇటీవలే బెయిల్ పై అచ్చెన్నాయుడు విడుదలయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు.

సానుభూతి వెల్లువెత్తడంతో…..

అయితే అచ్చెన్నాయుడికి బీసీల్లో పెద్దయెత్తున సానుభూతి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. ఆరోగ్యం బాగా లేకపోయినా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం, దాదాపు 500 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా తీసుకురావడం వంటి వాటిపై బీసీల్లో ప్రభుత్వం పై ఆగ్రహం కలిగించిందని చంద్రబాబు అంచనా వేసుకుంటున్నారు. అందుకే అచ్చెన్నాయుడికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

త్వరోలనే ప్రకటన….

త్వరలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని చంద్రబాబు ప్రకటించబోతున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. యనమల రామకృష్ణుడు, చినరాజప్ప వంటి సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా చంద్రబాబు తీసుకున్న తర్వాతనే అచ్చెన్నాయుడి పేరును ఫైనల్ చేశారన్న టాక్ పార్టీ వర్గాల్లో విన్పిస్తుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును తప్పించి ఆయన స్థానంలో అచ్చెన్నాయుడిని నియమించనున్నారు.

అచ్చెన్న పేరు ఖరారు…..

అచ్చెన్నాయుడికి మంచి వాగ్దాటితో పాటు పోరాట పటిమ కూడా ఉండటం కలసి వచ్చే అంశంగా చంద్రబాబు భావిస్తున్నారు. బీసీ వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వడంతో పాటు అచ్చెన్నకు వెల్లువెత్తిన సానుభూతిని పార్టీ వైపునకు మలచుకోవాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఈ నాలుగేళ్లు అచ్చెన్న వాయిస్ ను బలంగా వాడుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. అతి తర్వలోనే అచ్చెన్నాయుడి పేరును చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News