ఎవరినీ తప్పుపట్టలేం… ఇద్దరినీ సమర్థించలేం
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని అనుకోవాలో? లేక ఆనవాయితీ అనుకోవాలో తెలియదు కాని రాజకీయ పరిణామాలు మాత్రం ఇతర రాష్ట్రాల ముందు తలదించుకునే పరిస్థితి మాత్రం [more]
;
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని అనుకోవాలో? లేక ఆనవాయితీ అనుకోవాలో తెలియదు కాని రాజకీయ పరిణామాలు మాత్రం ఇతర రాష్ట్రాల ముందు తలదించుకునే పరిస్థితి మాత్రం [more]
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని అనుకోవాలో? లేక ఆనవాయితీ అనుకోవాలో తెలియదు కాని రాజకీయ పరిణామాలు మాత్రం ఇతర రాష్ట్రాల ముందు తలదించుకునే పరిస్థితి మాత్రం వచ్చింది. ఒకరు ఆధిపత్యం కోసం, మరొకరు సింపతీ కోసం. పదవులు మారినా, హోదాలు మారినా సీన్ మాత్రం అదే. నాడు జగన్, నేడు చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో అగచాట్లు పడుతున్నారు.
జగన్ విపక్షంలో ఉన్నప్పుడు…..
గతంలో జగన్ ప్రతిపక్ష నేత గా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఆయన పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి జగన్ ను వెనక్కు తిప్పిపంపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు ప్రమాదం ఘటనలో బాధితులను పరామర్శించడానికి జగన్ వెళ్లినప్పుడు కూడా పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలను అనేక సార్లు అరెస్ట్ చేసిన సంఘటనలు బాబు జమానాలో జరిగాయి.
ఇప్పుడు బాబు వంతు….
ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. చంద్రబాబును విశాఖలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచే వెనక్కు పంపారు. అలాగే తిరుపతి ఎయిర్ పోర్టులోనూ అడ్డుకున్నారు. ఇక టీడీపీ నేతల సంగతి చెప్పనవసరం లేదు. ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. ముందస్తు అరెస్టులతో పాటు అక్రమ కేసులు బనాయిస్తూ టీడీపీ నేతలను భయభ్రాంతులకు జగన్ ప్రభుత్వం గురి చేస్తుందన్న ఆరోపణలున్నాయి.
సానుభూతి కోసమే…..?
అయితే ఈ ఇద్దరూ ఒకే బాట పయనిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాము అనుభవించిన బాధను ప్రత్యర్థికి చూపించాలన్న లక్ష్యమే జగన్, చంద్రబాబుల్లో కనపడుతుంది. దీనివల్ల సానుభూతి వస్తుంది. అందుకే జగన్ ను రెచ్చగొడుతూ మరింత సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జగన్ ను ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి అని, ఫేక్ ముఖ్యమంత్రి అని పదే పదే మాట్లాడుతూ రెచ్చగొట్టి ఇలాంటి నిర్భంధాలను ఎన్ని ఎదుర్కొంటే అంత ప్లస్ అవుతుందన్నది చంద్రబాబు ఆలోచన. నిజమే… తిరుపతి విమానాశ్రయం ఘటనలో చంద్రబాబుకు సింపతీ వచ్చింది. జగన్ మరి విమానాశ్రయంలోనే చంద్రబాబును ఆపి ఏం సాధించారు? నిజానికి చంద్రబాబును వదిలేస్తేనే ఎవరూ పట్టించుకోరు. పట్టుకుంటేనే అందరూ పట్టించుకుంటారు.