వెయిట్ చేయడం వేస్ట్ అట
ఆంధ్రప్రదేశ్ లో అధికారం జారిపోయిందని టీడీపీకి చాలా ఆవేదనగా ఉంది. హుందా రాజకీయాలపై రోజూ మైకులు బద్దలయ్యేలా లెక్చర్లు దంచే చంద్రబాబునాయుడు సైతం ఇపుడు అన్నీ వదిలేశారు. [more]
;
ఆంధ్రప్రదేశ్ లో అధికారం జారిపోయిందని టీడీపీకి చాలా ఆవేదనగా ఉంది. హుందా రాజకీయాలపై రోజూ మైకులు బద్దలయ్యేలా లెక్చర్లు దంచే చంద్రబాబునాయుడు సైతం ఇపుడు అన్నీ వదిలేశారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో అధికారం జారిపోయిందని టీడీపీకి చాలా ఆవేదనగా ఉంది. హుందా రాజకీయాలపై రోజూ మైకులు బద్దలయ్యేలా లెక్చర్లు దంచే చంద్రబాబునాయుడు సైతం ఇపుడు అన్నీ వదిలేశారు. ఏడాది పాటు వేచి చూద్దామన్న మాటను పక్కన పెట్టేసి మరీ వైసీపీపై విరుచుకుపడుతున్నారు. సెంటిమెంట్ నే నమ్ముకుని కన్నీటి చిత్రాన్ని ఏపీ తెర మీద విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబునాయుడే మాకు సీఎం అంటూ ఓ వైపు ఆయన ఇంటికి వచ్చీ పోయే టీడీపీ మహిళల ఏడుపులు అలా ఉండగానే మా పార్టీ వాళ్లపై దాడులు చేస్తున్నరంటూ మరో సెంటిమెంట్ దట్టించారు. మా వాళ్ళను చంపేస్తారా, ఇది రాక్షస పాలన అంటూ పరామర్శ యాత్రల పేరిట గట్టిగా రెండు నెలలు తిరగకముందే జనంలోకి చంద్రబాబునాయుడు వచ్చేశారు.
ఫెయిల్యూర్ సీఎం అంటూ…..
తనకున్న మీడియా బలంలో జగన్ ను అసమర్ధునిగా చిత్రీకరించి అభాసుపాలు చేసేందుకు చంద్రబాబునాయుడు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. అనుకూల మీడియా ఇపుడు చంద్రబాబునాయుడు పాటే పాడుతోంది. జగన్ని చూపించడం కంటే టీడీపీ వాయిస్ నే బలంగా జనంలోకి పంపుతోంది. వైసీపీ నేతలు టీడీపీ వారిని చంపేస్తున్నారంటూ గట్టిగా ప్రచారం చేస్తోంది. ఓ విధంగా మెజారిటీ మీడియా సెక్షన్ ఇప్పటికీ టీడీపీ వైపు ఉండడంతో అది జనంలోకి వేగంగా వెళ్ళిపోతోంది. దానికి తోడు చంద్రబాబునాయుడు పరామర్శ యాత్రను లైవ్ ప్రొగ్రాం గా అనుకూల మీడియా చూపించడంతో ఏపీలో మళ్ళీ చంద్రబాబునాయుడు గొంతు బలంగా వినిపిస్తోంది. ఇక జగన్ చేతకాని సీఎం అంటూ ఇంకో వైపు లోకేష్, చంద్రబాబునాయుడు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. జగన్ ఒక్క హామీని కూడా తీర్చలేదని ఆయన ఘాటుగా ట్విట్టర్లో దట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా టీడీపీ ఇపుడు ఫోకస్ బాగా పెంచుతోంది.
తడబాట్లు.. పొరపాట్లు…..
మరో వైపు జగన్ కి అధికారం కొత్త, తొంబయి శాతం మంత్రులకు కూడా కొత్తే. ఇక అధికారులతో ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ కి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికీ చంద్రబాబునాయుడు మనుషులు అధికార వర్గాల్లో ఉన్నారు. ఈ నేపధ్యంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలు గట్టిగా ప్రభావితం చేయలేకపోతున్నాయి. అమల్లో జగన్ సర్కార్ వెనకబడుతోంది. విత్తనాల సరఫరా ఓ విధంగా అధికారుల తప్పిదం, అయినా బురద జగన్ మీద పడింది. హామీల విషయంలో కూడా అయోమయం కూడా విమర్శలకు తావు ఇస్తోంది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కి, విద్యా మంత్రి ఆదిమూలం సురేష్ కి అమ్మ ఒడి పధకం విషయంలో ఒక అభిప్రాయం లేదు. ఇది లోకేష్ కి అస్త్రంగా మారింది ఇప్పటికీ ఈ పధకం ఎవరికి అమలు చేస్తారో ఓ పెద్ద కన్ఫ్యూజనే. ఈ పరిస్థితుల్లో కరవు, వర్షాభావం కూడా జగన్ సర్కార్ కి మరో శాపంగా ఉన్నాయి. అన్నీ కలసి జగన్ ప్రభుత్వం విఫలం అంటూ టీడీపీ మొదలెట్టిన ప్రచారం నాలుగు వందల అబద్దాలతో జనంలోకి వెళ్ళిపోతోంది.