జెండా మోస్తూనే ఉన్నాం.. ఇంకా సానుభూతేనా బాబూ..!

అనంతపురం టీడీపీ త‌మ్ముళ్లలో ఆగ్రహం అలానే ఉంది. తాజాగా జ‌రిగిన టెలీ కాన్ఫరెన్స్ కు డుమ్మా కొట్టారు. అంతేకాదు.. మ‌రోసారి చంద్రబాబు.. త‌మ‌పై చేసిన కామెంట్ల విష‌యంలో [more]

;

Update: 2020-11-11 06:30 GMT

అనంతపురం టీడీపీ త‌మ్ముళ్లలో ఆగ్రహం అలానే ఉంది. తాజాగా జ‌రిగిన టెలీ కాన్ఫరెన్స్ కు డుమ్మా కొట్టారు. అంతేకాదు.. మ‌రోసారి చంద్రబాబు.. త‌మ‌పై చేసిన కామెంట్ల విష‌యంలో వారు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. దీనికి కార‌ణం ఏంటి ? ఎందుకు ఇంత అసంతృప్తితో ఉన్నారు అనేది చ‌ర్చనీయాంశంగా మారింది. ‘జెండాలు మోశారు. మోస్తున్నారు. మిమ్ములను ఎన్నటికీ మరువను. పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తా. గతంలో జరిగిన పొరపాటు జరగదు’ అని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పాదాభివందనం అంటూ……

ఇటీవ‌ల అనంత‌పురం జిల్లా హిందూపురం పార్లమెంటు టీడీపీ నేతలు, శ్రేణులతో చంద్రబాబు జూమ్‌ యాప్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీకి సైనికుల్లా పనిచేస్తున్న కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. మనందరం ప్రజలకు నిరంతరం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతే! అప్పటి వ‌ర‌కు త‌మ‌కేదో ప‌ద‌వులు ప్రక‌టిస్తారు. త‌మ‌నేదో గుర్తిస్తార‌ని భావించిన తృతీయ శ్రేణి నాయ‌కులు ఒక్కసారిగా జూమ్ యాప్‌ను బంద్ చేసి.. బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.

పదవులు అన్నీ పాతవారికే….

దీంతో అస‌లు ఏమైందంటూ.. నేత‌ల స‌న్నిహిత వ‌ర్గాలు ఆరాతీయ‌గా.. “ఆయ‌న చంద్రబాబు కాదు.. మార‌ని బాబు.. మార్పు లేని బాబు. జెండాలు ఇప్పుడు కొత్తగా మోయ‌డం లేదు. రెండు ద‌శాబ్దాలుగా మోస్తూనే ఉన్నాం. మాకేం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయ‌న త‌న అనుంగుల‌కే ప‌ద‌వులు ఇచ్చుకున్నారు. కానీ, జెండా మోత బ‌రువును మ‌ళ్లీ మా భుజాల‌పైనే పెట్టారు. ఇంక ఎన్నాళ్లని మోస్తాం. యువ‌త‌కు ప్రాధాన్యం అన్నారు. మా పిల్లలు ఎదురు చూస్తున్నారు. మాకు ప‌ద‌వులు అన్నారు. మొండి చేయి చూపించారు. ఇప్పుడు మ‌ళ్లీ జెండా మోయాలంటూ.. న‌మస్కారాలు పెడుతున్నారు. మేం ఏకంగా పార్టీకే న‌మ‌స్కారం పెట్టాల‌ని చూస్తున్నాం“ అని వ్యాఖ్యానించారు. మొత్తానికి చంద్రబాబు వ్యూహాలు ఇప్పుడు ప‌నిచేసేలా లేవే అనే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News