వారికి చంద్రబాబు ఇలా పనిష్మెంట్ ఇచ్చారా?

చంద్రబాబు విజన్ చూసి వచ్చామన్నారు. ఆయన చేసిన అభివృద్ధిని చూసి జెండా మార్చామన్నారు. కానీ వారందరినీ గత ఎన్నికల్లోనే కాదు ఇప్పుడు పార్టీ పదవులకూ చంద్రబాబు దూరం [more]

;

Update: 2020-11-18 02:00 GMT

చంద్రబాబు విజన్ చూసి వచ్చామన్నారు. ఆయన చేసిన అభివృద్ధిని చూసి జెండా మార్చామన్నారు. కానీ వారందరినీ గత ఎన్నికల్లోనే కాదు ఇప్పుడు పార్టీ పదవులకూ చంద్రబాబు దూరం పెట్టడం చర్చనీయాంశమైంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ లో చేరిపోయారు. అయితే వీరిలో గత ఎన్నికల్లో కొందరికి మాత్రమే తిరిగి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. వారిలో గొట్టిపాటి రవికుమార్ తప్ప ఎవరూ విజయం సాధించలేదు.

పార్టీ పదవుల్లో…..

ప్రస్తుతం పార్టీ పదవులను చంద్రబాబు భర్తీ చేశారు. ఇంకా రాష్ట్ర కమిటీ నియామకం ఉంది. పొలిట్ బ్యూరో పూర్తయిపోయింది. జంబో పొలిట్ బ్యూరోలోనూ జంప్ జిలానీలకు చంద్రబాబు స్థానం కల్పించలేదు. అలాగే పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ ఛార్జుల పదవులకు కూడా చంద్రబాబు వారిని దూరం పెట్టారు. ఇది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాము పార్టీ మారి వచ్చినా నియోజకవర్గంలోనే కాదు అధినాయకత్వం కూడా గుర్తించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

23 మంది ఎమ్మెల్యేలు వస్తే….

గతంలో వైసీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్, కలమల వెంకటరమణ, సుజయ కృష్ణ రంగారావు, సర్వేశ్వరరావు, వరపుల సుబ్బారావు, జ్యోతుల నెహ్రూ, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్, డేవిడ్ రాజు, పోతుల రామారావు, అశోక్ రెడ్డి, సునీల్ కుమార్, జయరాములు, ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ, చాంద్ భాషా, అమర్ నాధ్ రెడ్డి వంటి వారు టీడీపీలో చేరిపోయారు.

ఒకిద్దరికి మాత్రమే…..

వీరిలో జ్యోతల నెహ్రూ కుమారుడు జ్యోతుల నవీన్ కు మాత్రమే చంద్రబాబు పదవిని కట్టబెట్టారు. మిగిలిన వారిలో కొందరు పార్టీని వీడినా ఇప్పటికీ గిడ్డి ఈశ్వరి, పోతుల రామారావు,జయరాములు, అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి వంటి వారు యాక్టివ్ పార్టీలో ఉన్నారు. వారి నియోజకవర్గాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ వీరిలో ఎవరికీ చంద్రబాబు పార్టీ పదవిని అప్పగించలేదు. అంటే పార్టీ మారి వచ్చిన వారిని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేసినట్లే కన్పిస్తుంది. వారంతా ఇప్పుడు ఆవేదనతో ఉనట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News