టీడీపీ పదవులు….తీపిగా ఉంటాయా…?
అధికారంలో ఉంటే చంద్రబాబు పులి అయిపోతారు. ఆయన కంటికి ఎదురుగా ఎవరూ అసలు కనిపించరని అంటారు. తాను ఒక్కడు చాలు రాష్ట్రమంతటా జెట్ స్పీడ్ తో సైకిల్ [more]
;
అధికారంలో ఉంటే చంద్రబాబు పులి అయిపోతారు. ఆయన కంటికి ఎదురుగా ఎవరూ అసలు కనిపించరని అంటారు. తాను ఒక్కడు చాలు రాష్ట్రమంతటా జెట్ స్పీడ్ తో సైకిల్ [more]
అధికారంలో ఉంటే చంద్రబాబు పులి అయిపోతారు. ఆయన కంటికి ఎదురుగా ఎవరూ అసలు కనిపించరని అంటారు. తాను ఒక్కడు చాలు రాష్ట్రమంతటా జెట్ స్పీడ్ తో సైకిల్ తొక్కేసి కుర్చీ పట్టేయగలను అనుకుంటారు. ఇక పవర్ నుంచి దిగిపోయాక చంద్రబాబులో అసలైన నాయకుడు అలా బయటకు వచ్చేస్తాడు. తాను పార్టీ కోసమే ఉన్నానని, కార్యకర్తలే తన ప్రాణమని చెబుతూంటారు. ఒక విధంగా చంద్రబాబును స్ప్లిట్ పర్సనాలిటీగా కూడా ప్రత్యర్ధులు అందుకే అంటారేమో. ఆయన ఏమిటో పార్టీ వారికే అలా అర్ధం కారని చెబుతారు. ఇపుడు అలాగే చంద్రబాబు అడిగిన వారికే కాదు, అడగని వారి ఇంటి తలుపు తట్టి మరీ పదవులు పంచేశారు.
అపర విశ్వామిత్ర …..
చంద్రబాబును అపర విశ్వామిత్రగా చెప్పుకోవాలేమో. కేవలం 23 సీట్లకు పడిపోయి కనీసం ఎమ్మెల్సీ గా కూడా ఎవరినీ గెలిపించలేని స్థితిలో ఉన్నా కూడా చంద్రబాబు పదవులు పంచేస్తున్నారు. చూం మంత్రం చదువుతూ అలా బోలేడు పదవులు సృష్టించేస్తున్నారు. నిజానికి టీడీపీ జాతీయ పార్టీ ట్యాగ్ తగిలించుకుంది కానీ గట్టిగా మాట్లాడితే కోస్తాలోని నాలుగు జిల్లాల్లోనే బలంగా ఉందని అంటున్నారు. అయినా సరే జాతీయ కార్యవర్గం ప్రకటించేశారు. ఈసారి కొత్తగా సెంట్రల్ కమిటీ పేరిట పదవులు క్రియేట్ చేశారు. ఇపుడు రాష్ట్ర కమిటీ అంటూ జంబో సైజ్ నే డిజైన్ చేసి తమ్ముళ్ళ మీదకు వదిలారు. విశ్వామిత్రుడు త్రిశంకు శ్వర్గం సృష్టిస్తే తమ్ముళ్ళ ఆనందం కోసం బాబు పదవులు ఎన్ని అయినా సృష్టించి ఇచ్చేస్తున్నారు.
చెమటోడ్చాలా…?
ఈ పదవులు అన్నీ ఎందుకు అంటే క్యాడర్ లో జోష్ తీసుకురావడానికే అంటున్నారు. ఇంతకాలం నిరాశతో దిగాలు పడిన వారికి తలో పదవి పంచి పెడితే తానూ నాయకుడు అనుకుంటూ ప్రతీ తమ్ముడూ దిగ్గున లేచి నిలబడతాడని, ఆ ఆవేశంతో కాగల కార్యం నెరవేర్చుకోగలమని చంద్రబాబు భారీ ప్లాన్ వేశారు. అయితే ఇవి జెండా పట్టే పదవులు, ఎండలో తిరిగే పదవులు, చమటోడ్చాల్సిన పదవులు. మరి ఈ పదవుల వల్ల క్యాడర్ కి లాభం ఉందా అంటే హోదా ఇచ్చామని బాబు అంటున్నారు కాబట్టి అవి పదవులే అనుకోవాలి. అసలైన అధికారంలో చంద్రబాబు దాదాపు పద్నాలుగేళ్ళ పాటు ఉన్నారు. మరి నాడు పదవులు ఇచ్చారా అంటే అది అడగకూడదు, ఇపుడు కష్టపడితే మళ్ళీ అధికారంలోకి బాబు వస్తే ఆ లెక్కలు చూసుకోవాలంతే.
తమ్ముళ్ళు నమ్ముతారా…?
ఇప్పటికి చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా పార్టీ కార్యకర్తలకు దక్కిన పదవులు అతి స్వల్పం. బాబు చుట్టూ ఉన్న కోటరీయే వాటిని తన్నుకుపోతుంది అన్న విమర్శలు ఉన్నాయి. అలా పదవులు పంచిన ఘనత ఎన్టీయార్ కే చెల్లింది. ఆయన తన అభిమాన సంఘం నాయకుడు శ్రీపతి రాజేశ్వర్ ని తెచ్చి మంత్రిని చేశారు. అలాగే నెల్లూరుకు చెందిన రమేష్ రెడ్డి అన్న ఒకాయన్ని కూడా తెచ్చి అధికార పీఠంపైన పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్న గారి టైం లో కార్యకర్తలు నిజమైన అధికారం అనుభవించారు. ఇపుడు చంద్రబాబు మాత్రం పార్టీ పదవులు ఇచ్చాను అంటూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను అని చిట్టా పద్దులు చదువుతున్నారు. కాగితం మీద పంచదార అని రాసి తీపి రుచి చూడమంటే ఇలాగే ఉంటుందని కూడా సెటైర్లు పడుతున్నాయి. మొత్తానికి పదవులు ఇచ్చేశాం, నన్ను సీఎంని చేయండని బాబు ముల్లు కర్రె పట్టుకుని తమ్ముళ్ళ మీద పెత్తనం చేయడమే ఇక మిగిలి ఉంది.