టీడీపీపై మరో క్యాస్ట్ గుస్సా… బాబుకు మరో షాక్ తప్పదా?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో నేతల మధ్య అసంతృప్తులు ఒక భాగమైతే.. మరోవైపు సామాజిక వర్గాలు కూడా పార్టీపై అసంతృప్తితో ఉండడం ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తోంది. [more]
;
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో నేతల మధ్య అసంతృప్తులు ఒక భాగమైతే.. మరోవైపు సామాజిక వర్గాలు కూడా పార్టీపై అసంతృప్తితో ఉండడం ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తోంది. [more]
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో నేతల మధ్య అసంతృప్తులు ఒక భాగమైతే.. మరోవైపు సామాజిక వర్గాలు కూడా పార్టీపై అసంతృప్తితో ఉండడం ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తోంది. ఆది నుంచి పార్టీకి అండగా ఉంటున్నామని.. కానీ.. తమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని కొన్ని వర్గాలు మండిపడుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా పార్టీకి పట్టు కొమ్మలుగా ఉన్న బీసీలను చంద్రబాబు పక్కన పెట్టేసి కాపులను భుజానకెత్తుకున్నారు. దీంతో బీసీల్లో కొన్ని బలమైన కులాలు టీడీపీకి, చంద్రబాబుకు దూరం దూరం జరిగాయి. ఇక ఇప్పుడు మరో ప్రధాన కులం కూడా చంద్రబాబుపై గుస్సాతో ఉన్నారు. పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తీవ్రంగా కుమిలిపోతున్నారు. పార్టీ పదవుల్లోనూ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చే పదవుల్లోనూ తమకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు రగిలిపోతున్నారు.
కీలక సమయంలో ….
కొందరు పార్టీలో విజిటింగ్ నాయకుల మాదిరిగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు వారికి ప్రాధాన్యం ఇస్తుండడంపైనా విమర్శలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు పాలనా సమయంలో ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించారు. దీంతో మాదిగ సామాజిక వర్గానికి ఇంది కొంత వరకు మేలు చేసింది. దీంతో అప్పటి నుంచి పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా మాదిగ వర్గం టీడీపీతోనే ఉంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో మాల సామాజిక వర్గం టీడీపీకి దూరంగా ఉంటూ.. వైఎస్ కనుసన్నల్లో పనిచేసిందనే భావన ఉంది. అయితే. ఆ సమయంలోనూ మాదిగ వర్గం టీడీపీకి మద్దతుగా నిలిచింది.
బాబు గుర్తించలేదని….
ఇక, గత 2014లో చంద్రబాబు సర్కారు ఏర్పాటులోనూ మాదిగ వర్గం ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత కూడా పార్టీని అంటిపెట్టుకునే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మాలలు ఎక్కువుగా ఉండడంతో చంద్రబాబు ఇచ్చే ప్రయార్టీలో మాదిగలు వెనక పడిపోయారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మాల వర్గానికి చెందిన కారెం శివాజీ, జూపూడి ప్రభాకర్ పార్టీలోకి వచ్చి పదవులు అందిపుచ్చుకున్నారని, తర్వాత ప్రభుత్వం పడిపోగానే పార్టీ నుంచి దూరమై.. వైసీపీకి చేరువయ్యారరు. కానీ.. ఇప్పటి వరకు మాదిగ వర్గానికి చెందిన నేతలు ఒక్కరు కూడా పార్టీకి దూరం కాకపోగా.. పార్టీ తరఫునే వాయిస్ వినిపిస్తున్నారని.. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించలేక పోతున్నారనేదివారి ఆవేదన.
వారికే ప్రయారిటీ……
మాదిగ నేతల ఆవేదనలో కూడా నిజం ఉంది. బాబు సీఎం అయిన వెంటనే వైసీపీ నుంచి వచ్చిన జూపూడి పదవి అందుకున్నారు. అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని కారెం శివాజీ పదవి దక్కించుకున్నారు. ఇక మాదిగ వర్గం నేతల్లోనూ పార్టీ కోసం ఎప్పటి నుంచో ఉన్న వారికి కూడాప్రయార్టీ ఇవ్వలేదు. పార్టీలో ఆదినుంచి ఉన్నవారిని పక్కన పెట్టి.. కొత్తగా వచ్చిన డొక్కా మాణిక్యవర ప్రసాద్‌తో పాటు రావెల కిషోర్‌బాబు వంటివారికి పదవులు ఇవ్వడంపై వారినే ప్రోత్సహించడం కూడా మాదిగ వర్గంలో తీవ్ర అసంతృప్తిని నింపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటీవల ప్రత్యేకంగా రహస్యంగా మాదిగ వర్గం భేటీ అయింది.
సమావేశమైన నేతలు….
ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే తాము భేటీ అయ్యామని చెబుతున్నా.. టీడీపీకి వ్యతిరేకంగానే ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. అయితే… ఈ భేటీకి వచ్చిన కొందరు సీనియర్లు సంయమనం పాటించాలని.. సమస్యలను చంద్రబాబుకు వివరించి పరిష్కరించుకుందామని.. అప్పటికీ వినకపోతే.. నిర్ణయం తీసుకుందామని సూచించినట్టు సమాచారం. ఏదేమైనా.. మాదిగ వర్గంలో రేగిన అసంతృప్తి ఎటు దారితీస్తుందోనని పార్టీలో చర్చ జరుగుతుండడం గమనార్హం.