చంద్రబాబుని డ్రీమ్స్ లో తిప్పుతున్నదెవరు ?

చంద్రబాబు చాలా అతిగా ఆలోచిస్తారు. తన నీడను చూసి తానే భయపడిపోతారు. లేకపోతే కొడుకు ఈడు వాడు జూనియర్ ఎన్టీయార్ ని చేర‌దీయకుండా దూరం పెట్టడమేంటి. పార్టీకి [more]

;

Update: 2020-11-23 06:30 GMT

చంద్రబాబు చాలా అతిగా ఆలోచిస్తారు. తన నీడను చూసి తానే భయపడిపోతారు. లేకపోతే కొడుకు ఈడు వాడు జూనియర్ ఎన్టీయార్ ని చేర‌దీయకుండా దూరం పెట్టడమేంటి. పార్టీకి ఏ గతి పట్టినా సరే తానూ లోకేష్ తప్ప ఎవరూ ఉండవద్దు అని శాసించడమేంటి. టీడీపీకి వెన్నుపోట్లు అలవాటే. కానీ రెండు సార్లూ ఆ వెన్నుపోట్ల కత్తి పోట్లను చవి చూసింది దివంగత నేత, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయారే. ఇక వెన్నుపోట్ల బాధ ఎలా ఉంటుందో బాధితుల గోడు చెవులారా వినడమే తప్ప తాను ఎపుడూ ఆ పోటు వేటుకు పడ‌ని చాణక్య రాజకీయం చంద్రబాబుది. ఇక ఎన్టీయార్ తో పాటు అనేక పార్టీలకు కూడా బాబు వెన్నుపోట్లు పొడిచారని అంటారు.

జగన్ కి వెన్నుపోటు …

జగన్ కి వెన్నుపోటు పొడవాలని చంద్రబాబుకు కసిదీరా ఉందని అంటారు. ఆయన అధికారంలో ఉన్నపుడు 23 మంది ఎమ్మెల్యేలను లాగేసి వైసీపీ కూసాలు కదిలించే ప్రయత్నం చేశారు. అయితే జగన్ గట్టి పిండం. జనాల్లోకి పోయి అక్కడే తేల్చుకున్నాడు. అలా చంద్రబాబు లాగేసిన 23 మందినే ఆయన‌కు వదిలేసి మరీ బంపర్ విక్టరీ కొట్టాడు. ఇపుడు అందులో కూడా ఎందరు ఎమ్మెల్యే తమ్ముళ్ళు చంద్రబాబు వెంట ఉన్నారో తెలియదు. దాంతో జగన్ 151 సీట్లతో పాటు మరికొందరి ఎమ్మెల్యేల మద్దతుతో రాజకీయ బాహుబలిగా కడు బలంగా కనిపిస్తున్నారు. అయినా సరే జగన్ కి వెన్నుపోటు తప్పదు అన్నది చంద్రబాబు భావనగా కోరికగా ఉందనిపిస్తోంది.

మనసెరిగిన మీడియా..?

చంద్రబాబు మనసును బట్టి కధలు అల్లడం అనుకూల మీడియాకు అలవాటే. అలా ఆయనకు 2019 ఎన్నికల ముందు జాతీయ స్థాయిలో మరోసారి నాయకత్వం వహించే చాన్స్ అంటూ మల్టీ కలర్స్ డ్రీమ్స్ చూపించేశారు. తీరా చూస్తే వాస్తవంలో చంద్రబాబు అతి ఘోరమైన రాజకీయ పతనాన్నే ఏపీలో చూశారు. అయినా సరే బాబుని మోసే మీడియాకు అలుపు లేదు, వెరపు అంతకంటే లేదులా ఉంది. అందుకే జగన్ పార్టీలో అసమ్మతి వారికి మాత్రమే బడబాగ్నిలా కనిపించింది. ఒక బలమైన సామాజికవర్గం వైసీపీలో నలిగిపోతోందిట. జగన్ నిర్ణయాలతో వారికి ఇబ్బందిగా ఉందిట. అందుకే తిరుగుబాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు అని వంట వండేసింది.

అయ్యే పనేనా…?

జగన్ తండ్రి కాలం నాటి రాజకీయ మనిషి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే వెన్నుపోటు వీరుడిగా అనుకూల మీడియా చూపించే ప్రయత్నం చేసింది. ఏకంగా ఆయనకు 52 మంది వైసీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా లెక్క కట్టింది. ఇక మరి కొందరు అటు ఇటు అయితే జగన్ సీటు జారిపోవడం ఖాయమని కట్టు కధలు అల్లేసి చంద్రబాబుకి ఫుల్ పొలిటికల్ మాస్ మసాలా సినిమా చూపించేసింది. కానీ అది అయ్యే పనేనా అని ఏ మాత్రం లాజిక్ ఉన్న వారు అయినా ఆలోచన చేస్తారు కదా. జగన్ ఎన్టీయార్ లా వయసు మళ్ళిన నేత కాదు, రాజకీయ అనుభవం లేని వాడు అంతకంటే కాడు, ఇక ఆయన ఎమ్మెల్యేలు అంతటి సాహసం చేసే స్థితిలో లేరు. వీటికి మించి జగన్ మీద తిరుగుబాటు చేసే సత్తా ఉన్న వారు కూడా ఎవరూ అక్కడ లేరు. వైసీపీ అంటే జగన్, ఆయనే పార్టీ. అది ఆయనతోనే పార్టీ ఉంటుంది. అది సత్యం. అందుకే వైసీపీ మంత్రి కొడాలి నాని గట్టిగానే తగులుకున్నారు. వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు లెవరూ వైసీపీలో లేరని కూడా సెటైర్లు వేశారు. అలా చేస్తే జనం కూడా చెప్పుతో కొడతారు అని కూడా ఫ్యూచర్ కూడా చెప్పేశారు. మొత్తానికి చంద్రబాబుకు మాత్రం ఇలాంటి ఆశలు వ్యూహాలు ఉంటాయని ఏపీ జనాలకు ముందే తెలిసిందో ఏమో జగన్ దరిదాపులకు కూడా రానీయకుండా 23 సీట్లకే టీడీపీని కట్టి పడేశారు అనుకోవాలి మరి.

Tags:    

Similar News