తిరుపతి ట్రయల్ మాత్రమేనట
తిరుపతి ఉప ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే తిరుపతి ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు పోటీ చేసే [more]
;
తిరుపతి ఉప ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే తిరుపతి ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు పోటీ చేసే [more]
తిరుపతి ఉప ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే తిరుపతి ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు పోటీ చేసే అవకాశముంది. కాంగ్రెస్ బరిలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటు, బీజేపీ, జనసేన కలసి తమ అభ్యర్థిని బరిలోకి దించనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ చంద్రబాబు ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత భవిష్యత్ రాజకీయాలపై ఒక క్లారిటీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.
బీజేపీ, జనసేనకు పెద్ద ఆశలే….
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. మరో దుబ్బాక ఫలితం ఇక్కడ వస్తుందని బీజేపీ భావిస్తుంది. అయితే తిరుపతి ప్రాంతంలో అంత సులువు కాదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. రెండు పార్టీలూ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కడా ఈ రెండు పార్టీలూ బలంగా లేవు. కొద్దో గొప్పో జనసేనకు కుల బలం అండగా ఉంది. దీంతో వారి సత్తా ఏంటో తిరుపతి ఉప ఎన్నికలో బయటపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
విమర్శించడమే పనిగా….
నిజానికి ఈ ఉప ఎన్నికలకు ముందే పొత్తుతో వెళితే మంచిదని చంద్రబాబు భావించారు. కానీ బీజేపీ కలసి రావడం లేదు. ప్రధానంంగా రాష్ట్ర నేతలు చంద్రబాబు అంటేనే మండిపడుతున్నారు. ఉదయం లేస్తే చంద్రబాబును విమర్శించడమే బీజేపీ నేతలు పనిగా పెట్టుకున్నారు. దీంతో చంద్రబాబు కూడా తిరుపతి ఉప ఎన్నికను ట్రయల్ గా చూడాలనుకుంటున్నారు. ఆ రెండు పార్టీలతో పోల్చుకుంటే టీడీపీకే ఇక్కడ బలం ఎక్కువగా ఉంది.
ఫలితాల తర్వాత….
అందుకే ఫలితాల తర్వాత బీజేపీ నేతలు రియలైజ్ అవుతారని చంద్రబాబు ఆశిస్తున్నారు. తమ బలం ఏంటో తెలిసిన తర్వాత తమ వద్దకు వారంతట వారే వస్తారని చంద్రబాబు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అందుకే తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏ మాత్రం ఓట్లు చీలిపోకుండా చూడాలని నేతలకు చంద్రబాబు జాగ్రత్తలు చెబుతున్నారట. గెలుపోటములు పక్కన పెడితే బీజేపీ సత్తా ఏంటో దానికి తెలపాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నిక తర్వాత బీజేపీ దిగి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.