థాంక్యూ చంద్రబాబు అంటున్నారే ?

రాజకీయం అంటే అదే మరి. ఇక్కడ ఆర్భాటాలు అతి ముఖ్యం. అంతే కాదు చేసిన పని ఒకటికి పదిసార్లు చెప్పుకోవాలి. అలా చేయాలంటే పార్టీని ప్రభుత్వానికి అనుసంధానం [more]

;

Update: 2020-12-03 00:30 GMT

రాజకీయం అంటే అదే మరి. ఇక్కడ ఆర్భాటాలు అతి ముఖ్యం. అంతే కాదు చేసిన పని ఒకటికి పదిసార్లు చెప్పుకోవాలి. అలా చేయాలంటే పార్టీని ప్రభుత్వానికి అనుసంధానం చేయాలి. కానీ జగన్ అవినీతి రహిత పాలన అంటూ తమ నేతలు, కార్యకర్తల మూతులు కట్టేశారు. వారిని ఇంట్లో పెట్టేశారు. ఫలితంగా జగన్ స్కీములు అన్నీ కూడా వాలంటీర్ల పరం అయ్యాయి. వారే లబ్దిదారులకు దేవుళ్ళుగా కనిపిస్తున్నారు. ఇక తాజాగా ఇది టీడీపీకి కూడా రాజకీయ లాభాన్ని ఇచ్చేలా మారుతోంది.

టిడ్కో క్రెడిట్ అటే…

సరిగ్గా టైం చూసి చంద్రబాబు నా ఇల్లు నా సొంతం అంటూ ఆందోళనకు పిలుపు ఇచ్చారు. కొన్ని రోజుల పాటు టీడీపీ క్యాడర్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసింది. ఈలోగా జగన్ సర్కార్ టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు ఇస్తామని ప్రకటించింది. దాంతో ఈ క్రెడిట్ మొత్తం వెళ్ళి టీడీపీ అకౌంట్ లో పడిపోయింది. ఇలా వాలంటీర్ల నుంచి టిడ్కో ఇళ్ళ పత్రాలను అందుకుంటున్న లబ్దిదారులు అంటునుంచి అటే టీడీపీ నేతల ఇళ్ళకు వెళ్ళి మరీ ధన్యవాదాలు చెబుతున్నారు. ఇదంతా తమకు చంద్రబాబు దగ్గరుండి ఇప్పించారని వారు చంద్రబాబుని తెగ గుర్తు చేసుకుంటున్నారు.

అంతా చేసి మరీ ….

నిజానికి టిడ్కో ఇళ్ళు చంద్రబాబు హయాంలో కట్టినా వాటికి మౌలిక సదుపాయాలు కల్పించి పంపిణీ చేస్తున్నది మాత్రం వైసీపీ సర్కార్. కానీ ఇక్కడెక్కడా వైసీపీ క్యాడర్ ని జగన్ ఇన్వాల్స్ చేయకపోవడంతో వారు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో వాలంటీర్లు కూడా వైసీపీ నేతలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తామే ధృవపత్రాలను లబ్దిదారులకు ఇచ్చేస్తున్నారు అలా గుట్టు చప్పుడు కాకుండా సచివాలయ సిబ్బంది తమ బాధ్యతగా ఈ కార్యక్రమం చేసేస్తూంటే తమ పక్కన ఉన్న లబ్దిదారుడికి ఇల్లు దక్కినా తెలుసుకోలేని అమాయకత్వంలో వైసీపీ నేతలు ఉన్నారు.

గ్రాఫ్ పెంచేశారుగా…?

ఎక్కడ వైసీపీ కార్యకర్తలను పధకాల విషయంలో ఇన్వాల్వ్ చేస్తే చెడ్డ పేరు వస్తుందో అని జగన్ ఆలోచించారు. అలాగే చేతి వాటాలు, అవినీతి వాటాలతో పార్టీ కంపు కొడుతుందని భావించారు. ప్రభుత్వ పరంగా అది మంచిదే అయినా ఒక పార్టీగా వైసీపీ జనాలకు చెప్పుకునేందుకు ఏమీ లేకుండా పోయినని నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికి 64 వేల కోట్లతో మూడున్నర కోట్ల మంది లబ్దిదారులకు మేలు చేసినా కూడా సరైన ప్రచారం లేదని కూడా వాపోతున్నారు. సరిగ్గా లోకల్ బాడీ ఎన్నికల వేళ టిడ్కో ఇళ్ల రూపేణా టీడీపీ పోరాటానికి బహుమానం అంటూ చంద్రబాబు గ్రాఫ్ ని జగన్ పెంచేశారు అన్న భావన కూడా వ్యక్తం అవుతోంది. మొత్తానికి పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానం లేకపోతే ఇలాగే ఉంటుందని వైసీపీ ని చూస్తే అర్ధమైపోతుంది.

Tags:    

Similar News