బాబు మానసిక సంఘర్షణకు లోనవుతున్నారా?

చంద్రబాబుకు అసెంబ్లీలో జగన్ ని సీఎం గా చూడడం చిన్నతనంగా ఉంది. తాను కలలో కూడా సీఎం కాడు అనుకున్న వ్యక్తి ఇలా తన ఎదురుగా ఉండడాన్ని [more]

;

Update: 2020-12-07 13:30 GMT

చంద్రబాబుకు అసెంబ్లీలో జగన్ ని సీఎం గా చూడడం చిన్నతనంగా ఉంది. తాను కలలో కూడా సీఎం కాడు అనుకున్న వ్యక్తి ఇలా తన ఎదురుగా ఉండడాన్ని చంద్రబాబు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఆయన మానసికంగా అతి పెద్ద సంఘర్షణే పడుతున్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో పెద్ద నేతలు తాము నమ్ముకున్న వారిని నాయకులను చేసి హుందాగా పక్కకు తప్పుకునే వారు. చంద్రబాబుకు ఆ అవకాశం కూడా లేకపోవడం, ఎమ్మెల్యేలు తోక జాడించే అవకాశాలు ఉండదంతో తప్పనిసరై అసెంబ్లీకి వస్తున్నారు. వచ్చినా కూడా ఆయన జగన్ ని అక్కడ చూసి తెగ ఫీల్ అవుతున్నాట్లుగానే ఆయన బాడీ లాంగ్వేజ్ ని చూస్తే అర్ధమైపోతోంది.

వీక్ పాయింటే అస్త్రం ….

ఇక యువ ముఖ్యామంత్రి జగన్ కూడా చంద్రబాబు బలహీనతలను చూసే గట్టిగా దెబ్బ కొడుతున్నారు. రాజకీయంగా చెడుగుడు ఆడుకుంటున్నాడు. చంద్రబాబు లాంటి సీనియర్ ఇజ్జత్ పోయేలా అసెంబ్లీ నిండా పరచుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దాన్ని తట్టుకోవాలంటే చాలా కష్టమే. చట్ట సభలు చాలాకాలంగా అంశాల మీద చర్చిండం మానేసి వ్యక్తిగత విమర్శలకు పోతున్నాయి. అది చంద్రబాబు నుంచే మొదలైంది. జగన్ హయాంలో కూడా కొనసాగుతోంది. దాంతో ఇపుడు చంద్రబాబు అడ్డంగా బుక్ అయిపోతున్నారు అంటున్నారు.

వద్దే వద్దా…?

అసెంబ్లీలో చంద్రబాబుకు మైక్ ఇస్తే ఆయన కూడా చెప్పాల్సిన సబ్జెక్ట్ బైపాస్ చేస్తూ తన గొప్పలు, గతంలో చేసిన పనులు అంటూ చాలానే చెప్పుకుంటూ పోతున్నారు. ఇది ఏ అధికార పక్షమూ సహించేది ఉండదు. ఇక మీకేం తెలుసు అంటూ చంద్రబాబు విసిరే విసుర్లు కూడా వైసీపీ యువతరం ఎమ్మెల్యేలకు గిట్టని మాటలే. అందుకే చంద్రబాబు అసెంబ్లీకి ఎలా రాం రాం అంటారా అని వారు ఎదురుచూస్తున్నారు. ఇలా అటు జగన్, ఇటు బాబూ ఇద్దరూ అదే విధంగానే వ్యవహరించడంతోనే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు గోల ఎక్కువైపోతోంది అంటున్నారు.

సరైన కారణంతో అలా….

చంద్రబాబు ఇపుడు జనం నుంచి సానుభూతి కోరుకుంటున్నారు. అసెంబ్లీకి ఒక పెద్ద నమస్కారం చేయాలంటే బలమైన కారణం అతికినట్లుగా ఉండాలి. దాని కోసమే చంద్రబాబు తన రాజకీయానికి పదును పెడుతున్నారు. అది కనుక దొరికితే మొత్తం బండను జగన్ మీద పడేసి ఆయన తాను జగన్ సీఎం ఉండగా అసెంబ్లీకి రానూ అంటూ భీషణ ప్రతిన చేసి మరీ తప్పుకుంటారని అంటున్నారు. అందుకే ఆయన వెయిట్ చేస్తున్నారు అని కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే జగన్ కనుక అలాంటి చాన్స్ చంద్రబాబుకు ఇస్తే అది టీడీపీకి సింపతీని తెచ్చిపెడుతుంది. అందువల్ల అధికార పక్షం కూడా జాగ్రత్తగా పావులు కదపకపోతే ఏపీ అసెంబ్లీ ఎన్టీయార్, జగన్ తరువాత చంద్రబాబు రూపంలో మరో సభా బహిష్కరణ పర్వాన్ని త్వరలోనే చూడనుంది అంటున్నారు.

Tags:    

Similar News