విలువ ఏదీ? విశ్వసనీయత ఏదీ?

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామలు చూస్తుంటే విశ్వసనీయత ముఖ్య భూమిక భవిష్యత్ లోనూ పోషించనుంది. ఇప్పుడు నాయకుల విశ్వసనీయతపైనే చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు [more]

;

Update: 2020-12-08 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామలు చూస్తుంటే విశ్వసనీయత ముఖ్య భూమిక భవిష్యత్ లోనూ పోషించనుంది. ఇప్పుడు నాయకుల విశ్వసనీయతపైనే చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై ఎన్ని ఆరోపణలు చేసినా వాటిని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు విశ్వసనీయత లేని నేతగా మిగిలిపోయారు కాబట్టి. చంద్రబాబు చెప్పే మాటలను జనం నమ్మరు కాని, జగన్ పాలనపై జనం వారంతట వారే విసుగు చెందితే తప్ప అది చంద్రబాబుకు అడ్వాంటేజీ కాదన్నది వాస్తవం.

అధికారంలో ఉన్నప్పుడు…..

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎవరీనీ కేర్ చేయలేదు. ప్రతిపక్షాలను పరిగణనలోకి తీసుకోలేదు. సొంత పార్టీ నేతలనే దగ్గరకు తీయలేదు. తాను శాశ్వత సీఎంగా ఉండిపోతారని భావించారు. అధికారులు ఇచ్చిన కాకి లెక్కలను రోజూ చూసుకుంటూ మురిసిపోయే చంద్రబాబుకు ఏపీ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారు. ఫలితాల తర్వాత గాని చంద్రబాబుకు తన పరిస్థితి ఏంటో తెలియలేదు. అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఎప్పడు ప్రమాణం చేయాలని కూడా ముహూర్తాలు పెట్టించుకుంటూ చంద్రబాబు కాలం గడిపేశారంటారు.

అన్నీ ధోకాలే……

చంద్రబాబు ఏ మాట చెప్పినా దానిపై నమ్మకం లేకుండా చేసుకున్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, అమరావతి, పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన డ్రామాలను ఏపీ ప్రజలు ఇంకా మరిచిపోలేదు. తాత్కాలికంగా ప్రజలను తన వైపునకు తిప్పుకునేందుకు చివరి నిమిషంలో ఇచ్చిన పసుపుకుంకుమ కూడా చంద్రబాబును ఆదుకోలేదు. అంటే చంద్రబాబును పదిహేను నెలల క్రితమే జనం నమ్మడం మానేశారని అర్థమయిందిగా?

జగన్ పై ఎన్ని నిందలు వేసినా…..?

ఇప్పుడు జగన్ ను ఫేక్ సీఎం అన్నా, నేరగాడు అని చెప్పినా, రాష్ట్రం అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోయిందని చంద్రబాబు రోజూ చెప్పినా ఎక్కువ శాతం మంది ప్రజలు నమ్మే పరిస్థితిలేదు. ఎందుకంటే చంద్రబాబుకు ఏపీలో విశ్వసనీయత లేదు. జగన్ తాను చెప్పిన మాట మీద నిలబడతారన్న నమ్మకం మాత్రం ఇప్పటికైతే ఉంది. అయితే రానున్న రోజుల్లో జగన్ పాలనపై విసుగు చెంది ప్రజలు బాబు వైపు మొగ్గు చూపాలే తప్ప, చంద్రబాబు చెప్పే మాటలకు మాత్రం విలువలేదన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News