బాబుకు మర్యాద కావాలి.. ఇచ్చేయరాదా ?

చంద్రబాబు అంటేనే వాగాడంబరం అని పేరు. ఆయన అతి చిన్న దాన్ని కూడా పెద్దది చేసి చెప్పుకుంటారు. తనను తాను ఏ మాత్రం బిడియం లేకుండా పొగిడేసుకుంటారు. [more]

;

Update: 2020-12-03 11:00 GMT

చంద్రబాబు అంటేనే వాగాడంబరం అని పేరు. ఆయన అతి చిన్న దాన్ని కూడా పెద్దది చేసి చెప్పుకుంటారు. తనను తాను ఏ మాత్రం బిడియం లేకుండా పొగిడేసుకుంటారు. ఎదుటివారిని ఊరకే కించపరుస్తారు. అంటే అత్మ స్తుతి పరనింద అన్న మాట. ఇదంతా చూసేవారికి ఎబ్బెట్టుగా ఉన్నా కూడా చంద్రబాబు ఏ మాత్రం ఆలోచించరు. సంకోచించరు. సరే బాబు పార్టీ వారికి ఆయన దేముడు. కాబట్టి ఆయన స్తోత్ర పాఠాలు చదువుతారు. కానీ అది అసెంబ్లీలో కుదురుతుందా. అది కూడా 151 సీట్లతో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ ఏలుబడిలో కలలోనైనా ఊహించగలరా.

అందుకే అలగనా..?

ఇది టీడీపీ ఆఫీస్ అనుకున్నారా చంద్రబాబు గారూ. మీ కీర్తనలు వినిపించడానికి అంటూ వైసీపీ మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు. బాబు విషయంలో వారు సెటైర్లు వేస్తున్నారు. ఎకసెక్కం ఆడుతున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్ అయిన చంద్రబాబుకు మండిపోతోంది. నాకు మర్యాద లేదా అంటూ ఆయనకు ఆయనే కోరి మరీ అడిగేస్తున్నారు. నేను ఇన్నేళ్ళ అనుభవం కలిగిన వాణ్ణి అని చెప్పేసుకుంటున్నారు. కానీ మీకు అసెంబ్లీకి రావడం ఇబ్బంది అయితే రిటైర్ అయిపోండి బాబూ అని కూడా ఉచిత సలహాలు వైసీపీ మంత్రులు ఇస్తున్నారు. కానీ చంద్రబాబు రాజకీయం కూడా ఇందులోనే ఉంది.

సింపతీ కోసమా ….?

ఇంత వయసు వచ్చిన తనను అకారణంగా దూషిస్తున్నారు. మూడు సార్లు సీఎం గా చేశానన్న గౌరవం కూడా లేదు అని తెగ మధనపడిపోతున్నారు చంద్రబాబు ఇవన్నీ జనాల బుర్రల్లోకి ఎక్కాలన్నది ఆయన ఆవేదన. తనను అసెంబ్లీలో వైసీపీ నేతలు అవమానించారని లోకానికి చాటి చెప్పాలన్నది బాబు గారి ఆరాటం. వైసీపీ వారు ఇస్తే మర్యాద. గట్టిగా తిడితే సింపతీ ఇదే చంద్రబాబు గారి పొలిటికల్ థియరీ. ఆ విధంగా వైసీపీని కవ్విస్తూ తన రాజకీయ అజెండా అమలు చేయడానికి బాబు పడుతున్న తాపత్రయం నిజంగా మెచ్చాల్సిందే మరి.

అయ్యే పనేనా..?

టీడీపీలో పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు లేరు. మాట్లాడితే అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌద‌రి, రామానాయుడు తప్ప మరో ఎమ్మెల్యే లేరు. ఇక చంద్రబాబు నోరు చేసుకోవాల్సివస్తోంది. బాబు కి మైక్ ఇవ్వగానే వైసీపీని విమర్శిస్తూనే ప్రసంగాలు చేస్తున్నారు. దాంతో వారికి మండుకొస్తోంది. అటునుంచి గట్టిగానే డైలాగులు పడిపోతున్నాయి. మొత్తానికి సభలో చంద్రబాబుకు మర్యాద దక్కడంలేదు. అయినా మర్యాద అంటే ఇచ్చి పుచ్చుకోవాల్సిందే కదా. సీనియర్ నేతగా బాబు కూడా సభను గౌరవించాలి కదా అని వైసీపీ నుంచి వస్తున్న వాదన. ఏది ఏమైనా మర్యాద కావాలంటున్నారు చంద్రబాబు. అదేదే ఇచ్చేస్తే పోలా సభ సాఫీగా జరుగుతుందేమో అని వైసీపీకి కూడా రాజకీయ సూచనలు అందుతున్నాయట.

Tags:    

Similar News