బాబు మెదడు మొద్దు బారిందా? చిప్ తన్నేసిందా?

ఏదైనా ఒక విషాద సంఘటన జరిగినప్పుడు సంయమనం పాటించాలి. విచారణ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకూ కొంత ఓపిక పట్టడం రాజకీయ నాయకుల ప్రధమ లక్షణం. [more]

;

Update: 2020-12-08 08:00 GMT

ఏదైనా ఒక విషాద సంఘటన జరిగినప్పుడు సంయమనం పాటించాలి. విచారణ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకూ కొంత ఓపిక పట్టడం రాజకీయ నాయకుల ప్రధమ లక్షణం. కానీ చంద్రబాబు ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్నారు. ఏలూరు ఘటన ఎవరికీ అంతు చిక్కని విధంగా తయారైంది. ఈ వ్యాధికి గల కారణాలను కూడా తొలిరోజుల్లో తెలియరాలేదు. వైద్యులు కిందా మీదా పడుతున్నారు. అంతుచిక్కని రోగంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

ప్రభుత్వ వైఫల్యమేనంటూ….

కానీ చంద్రబాబు మాత్రం ఇది ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ధ్వజమెత్తడం ఆయన సీనియారిటీకి తగదంటున్నారు. ఏలూరులో పారిశుధ్యం సక్రమంగా జరగడం లేదని, కాంట్రాక్టు కార్మికులకు వేతనాలను చెల్లించడం లేదని, అందుకే వ్యాధి ప్రబలిందని సంబంధంలేని ఆరోపణలు చంద్రబాబు చేశారు. ప్రభుత్వ చేతకాని తనంగా చంద్రబాబు చెప్పడాన్ని చూస్తే ఆయన ఫ‌్రస్టేషన్ ఎంత పీక్ లో ఉందో చెప్పకనే తెలుస్తుంది.

విడ్డూరం కాకపోతే…..

దీనికితోడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. మూడు రోజుల నుంచి వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని ఏలూరులోనే ఉన్నారు. అది ఆయన సొంత నియోజకవర్గం. పైగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను చూస్తుండటంతో అధికారులను సమన్వయం చేసుకుంటూ ఆళ్లనాని అక్కడే ఉంటున్నారు. మంత్రికి వైద్యం తెలియదని కూడా టీడీపీ నేతలు ప్రశ్నించారు. మంత్రికి వైద్యం తెలియాల్సిన అవసరం ఉందా? అది కూడా తెలియకుండా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది.

అభాండాలు వేయడమే…..

ఏ సంఘటన జరిగినా ప్రభుత్వ అసమర్థత అని చెప్పడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. ప్రభుత్వం అంటే జగన్ ఒక్కరే కాదు. మంత్రులు కాదు. అధికారులు కూడా అని గుర్తుంచుకోవాలి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిన అధికారులే ఇప్పుడూ జగన్ ప్రభుత్వంలో ఉన్నారు. దీనికి తోడు జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి నాసిరకం క్లోరిన్ సరఫరా చేసినందునే ఏలూరు లో వ్యాధి ప్రబలిందని టీడీపీ ప్రచారం చేయడం కూడా బాధాకరమే. ఒక సంఘటన జరిగినప్పుడు కారణాలు తెలసుకోకుడా అభాండాలు వేయడం, నిందలుమోపడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. దీనిని ప్రజలు మెచ్చరు.

Tags:    

Similar News