ఏ వ్యాపకం లేకనే?

రాజకీయ పార్టీల అధినేతలు, వివిధ రాజకీయ నేతలు రాజకీయాలకే పూర్తి సమయం కేటాయించరు. వారికున్న ఇష్టాయిష్టాలు, ఇతర వ్యాపకాలపై కాస్తంత శ్రద్ధ పెడుతుంటారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా [more]

;

Update: 2020-12-19 05:00 GMT

రాజకీయ పార్టీల అధినేతలు, వివిధ రాజకీయ నేతలు రాజకీయాలకే పూర్తి సమయం కేటాయించరు. వారికున్న ఇష్టాయిష్టాలు, ఇతర వ్యాపకాలపై కాస్తంత శ్రద్ధ పెడుతుంటారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా తమకు ఇష్టమైన పనులను వారు మానుకోరు. అలాగని రాజీకీయాలకు పూర్తిగా దూరం కారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పూర్తి కాలం రాజకీయాలకే సమయాన్ని వెచ్చిస్తారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయనకు పాలిటిక్స్ అంటేనే ఇష్టం. అదే ఆయన ప్రాణం.

వ్యవసాయం అంటే…?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యవసాయం అంటే ఇష్టం. ఆయన ముఖ్యమంత్రిగా కాకముందు వరకూ ఫాంహౌస్ లో ఎక్కువగా ఉండేవారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ కేసీఆర్ ఫాంహౌస్ ను వదలలేదు. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నెలలో పది రోజులపాటు కేసీఆర్ ఫాంహౌస్ లోనే ఉండేందుకు ఇష్టపడతారు. ఎన్ని విమర్శలు వచ్చినా కేసీఆర్ లెక్క చేయరు. ఫాంహౌస్ లో వ్యవసాయ పనులు చూసుకుంటుడం ఆయనకు ఇష్టం.

పారిశ్రామిక వేత్తగా…

ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయానికి వస్తే ఆయన స్వతహాగా పారిశ్రామికవేత్త. రాజకీయాలకు రాకముందు జగన్ పారిశ్రామికవేత్తగానే జనాలకు పరిచయం. ఆయన అనేక పరిశ్రమలకు అధిపతిగా ఉండేవారు. అధికారంలో లేని సమయంలో కొంత జగన్ తన కంపెనీ విషయాలను పరిశీలించేవారు. అది ఆయనకు ఇష్టమైన పని. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు మాత్రం ఎలాంటి వ్యాపకాలు లేవు.

బాబుకు తెలిసింది…

చంద్రబాబుకు తెలిసింది రాజకీయమే. ఆయనకు వ్యాపారాలు లేవని కాదు. అవన్నీ కుటుంబ సభ్యులే చూసుకుంటారు. తన వ్యాపారాలు, ఆస్తుల విషయంలో చంద్రబాబు ఏనాడూ పట్టించుకోరు. గత ఏడు నెలలుగా కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నా చంద్రబాబు మాత్రం రాజకీయాలకే ఎక్కువ విలువ ఇస్తారు. ఫ్యామిలి ట్రిప్ కూడా ఎప్పుడో ఒకసారి వేస్తారు. పూర్తి కాలం రాజకీయాలు చేసేది రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు తప్ప మరెవ్వరూ లేరు. అందుకే ఆయన చిన్న విషయానికి కూడా రియాక్ట్ అవుతారని పార్టీ నేతలే చెబుతుండటం విశేషం. అందుకే ఆయనకు అధికారం లేకపోతే ఫ్రస్టేషన్ కు లోనవుతుంటారు.

Tags:    

Similar News