సింపతీ రాజకీయాలకు బాబు దూరమయినట్లేనా?
తనకు సహజంగా అబ్బిన సెంటిమెంటు రాజకీయాల నుంచి చంద్రబాబు తప్పుకొంటున్నారని తెలుస్తోంది. రాజకీయాల్లో సెంటిమెంట్‌ను బాగా వాడుకున్న నాయకుల్లో చంద్రబాబు కీలకంగా కనిపిస్తారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో [more]
;
తనకు సహజంగా అబ్బిన సెంటిమెంటు రాజకీయాల నుంచి చంద్రబాబు తప్పుకొంటున్నారని తెలుస్తోంది. రాజకీయాల్లో సెంటిమెంట్‌ను బాగా వాడుకున్న నాయకుల్లో చంద్రబాబు కీలకంగా కనిపిస్తారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో [more]
తనకు సహజంగా అబ్బిన సెంటిమెంటు రాజకీయాల నుంచి చంద్రబాబు తప్పుకొంటున్నారని తెలుస్తోంది. రాజకీయాల్లో సెంటిమెంట్‌ను బాగా వాడుకున్న నాయకుల్లో చంద్రబాబు కీలకంగా కనిపిస్తారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తనపై తిరుమల వద్ద అలిపిరిలో జరిగిన నక్సల్స్ దాడి ఘటను సింపతీ ఓట్ల కోసం.. ఉపయోగించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తన సర్కారును ముందుగానే దింపేసుకుని ఎన్నికలకు వెళ్లారు. ఫలితం మాట ఎలా ఉన్నా.. సింపతీ రాజకీయం చేశారనే పేరు తెచ్చుకున్నారు. ఎంత సింపతీ డ్రామా ప్లే చేసినా, చేతికి కట్టుకట్టుకున్నా 2004 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
సింపతీ కోసం…..
2014లోనూ మేధావిగా చంద్రబాబు తనకు తాను ప్రొజెక్టు చేసుకుని ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఇక, గత ఏడాది ఎన్నికల్లో కూడా సింపతీ ప్లే చేసినా.. మహిళా గళం వినిపించి.. పసుపు కుంకుమలు పంచినా… కూడా ఎక్కడా వర్కవుట్ కాలేదు. దీనికి ముందు.. కాపులను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సింపతీ కోసం ప్రయత్నించారు. అది కూడా వర్కవుట్ కాలేదు. ఇక తన వయసును పదేపదే ప్రస్తావించేవారు. తన మనవడితో ఆడుకుంటున్న ఫొటోలను కూడా పదేపదే తన అనుకూల మీడియాలో చూపించేవారు. ఇదంతా కూడా చంద్రబాబు సింపతీ కోసమే చేసింది కావడం గమనార్హం.
గత ఏడాది కూడా….
అలాంటి చంద్రబాబు గత ఏడాది ఓడిపోయిన తర్వాత కూడా సింపతీ కోసం అల్లాడిపోయారు. తన ఇంటిని జగన్ ప్రభుత్వం వరద నీటితో ముంచేస్తోందని తనను ఏపీలోకి అడుగు పెట్టకుండా చేస్తోందని చంద్రబాబు భారీగానే సింపతీ కోసం పాకులాడారు. సరే ఇప్పుడు తాజాగా జరిగిన అమరావతి ఉద్యమానికి ఏడాది పండుగలో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలను పరిశీలిస్తే.. ఎక్కడా సింపతీ కోసం ప్రయత్నించినట్టు కనిపించడం లేదు.
యూటర్న్ తీసుకుని…..
కేవలం.. తాను ఏం చేశాను.. జగన్ ఏం చేశాడు ? అనే విషయాన్ని ప్రధానంగా తీసుకుని.. ప్రసంగించడం వెనుక.. సింపతీ రాజకీయాలు వర్కవుట్ కాలేక చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. ఆయన సవాళ్లను కూడా రువ్వారని.. అంటే.. తాను ఇంకా పుంజుకుంటున్నాననే సంకేతాలను పంపించినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఇక అంతకు ముందు జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనూ టీడీపీ ఎక్కడా బాబు – హైటెక్ సిటీ అన్న ప్రచారం చేయలేదు. గతంలో పదే పదే ఐటీ చంద్రబాబును అని చెప్పుకున్న ఆయన ఇక ఆ ప్రచారాన్ని కూడా వదులుకున్నట్టే కనిపిస్తోంది. మొత్తానికి సింపతీ రాజకీయాలు వర్కవుట్ కావనే విషయాన్ని బాబు గుర్తించారనే టాక్ మాత్రం జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.