బాబుకు దారి దొరికింది…?

జమిలి ఎన్నికలకు దాదాపుగా వచ్చేసినట్లే. ఆ దిశగానే సంకేతాలు అందుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఆయన ఎవరితో జట్టు కడతారు? ఒంటరిగానే ముందుకు [more]

Update: 2020-12-28 14:30 GMT

జమిలి ఎన్నికలకు దాదాపుగా వచ్చేసినట్లే. ఆ దిశగానే సంకేతాలు అందుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఆయన ఎవరితో జట్టు కడతారు? ఒంటరిగానే ముందుకు వెళతారా? అన్న చర్చ జోరుగా సాగుతుంది. గత ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి కేవలం 23 సీట్లకే పరిమితమయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి చంద్రబాబు జట్టుగానే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

జమిలి ఎన్నికలు వస్తుండటంతో…

ఆంధ్రప్రదేశ్ కు లోక్ సభ, శాసనసభ ఎన్నికలు గత కొన్ని దఫాలుగా ఒకేసారి జరుగుతున్నాయి. ఇది ఏపీకి కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఏడాది ముందే ఎన్నికలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా వెళ్లేకంటే కూటమితోనే వెళ్లడం మంచిదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. బీజేపీతో కలసి వెళ్లాలన్నదే చంద్రబాబు ఆలోచన.

ఢిల్లీకి వెళ్లి……

అందుకే త్వరలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లాలన్న యోచనలో ఉన్నారని తెలిసింది. గత ఇరవై నెలలుగా చంద్రబాబు ఢిల్లీ గడప తొక్కలేదు. మొన్నటి ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీతో వైరం పెట్టుకుని కాంగ్రెస్ తో జట్టు కట్టారు. అది ఫలితాలనివ్వకపోవడంతో ఈసారి కాంగ్రెస్ కు దూరంగానే ఉన్నారు. కానీ బీజేపీతో కలసి తాను నడవాలనుకుంటున్నా అందుకు రాష్ట్రంలో ఆ పార్టీ అంగీకరించే పరిస్థితి కన్పించడం లేదు.

కేంద్రమంత్రితో టచ్ లో…..

దీంతో ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం కేంద్రమంత్రి, బీజేపీలో కీలక నేతగా ఉన్న ఒకరితో చంద్రబాబు టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే సరైన సమయం చూసుకుని ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలసి వెళితేనే జగన్ ను దెబ్బకొడతామన్న అభిప్రాయంతో ఉన్న చంద్రబాబు ఆ మేరకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. తెలంగాణకు చెందిన ఒక బీజేపీ నేత కూడా చంద్రబాబుకు, బీజేపీ పెద్దలకు మధ్య సయోధ్య చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News