ఇంకా మిడిల్ క్లాస్ రాజకీయమే.. జాతీయ మీడియా టాక్
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం ఏంటి ? ఆయన దూకుడు ఎలా ఉంది ? తాజాగా జాతీయ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలను బట్టి చూస్తే.. చంద్రబాబుది [more]
;
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం ఏంటి ? ఆయన దూకుడు ఎలా ఉంది ? తాజాగా జాతీయ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలను బట్టి చూస్తే.. చంద్రబాబుది [more]
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం ఏంటి ? ఆయన దూకుడు ఎలా ఉంది ? తాజాగా జాతీయ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలను బట్టి చూస్తే.. చంద్రబాబుది మధ్యతరగతి రాజకీయమే అని చెప్పక తప్పదని అంటున్నారు పరిశీలకులు. కొన్ని రోజులుగా జాతీయ మీడియా రాష్ట్రాల వారీగా సంచలనాలు రేపిన నాయకుల గురించి ప్రత్యేక కథనాలను ప్రచురిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు గురించి కూడా జాతీయ మీడియా ప్రచురించింది. అయితే.. గతానికి భిన్నంగా.. చంద్రబాబును మిడిల్ క్లాస్ పొలిటీషియన్.. అంటూ పేర్కొంది. దీంతో టీడీపీ శ్రేణులకు ఏమీ అర్ధం కాలేదు.
ఆయన చేసిన రాజకీయాలే…..
మొత్తానికి చూస్తే.. కథనంలో చంద్రబాబును పొగుడుతున్నా.. ఆయన చేసిన రాజకీయాలే ఆయనను ఓడించాయనే తీర్పు దిశగా కథనాలు సాగాయి. మన దేశంలో సాధారణంగా.. ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు ఎన్ని ఎత్తులు వేసినా.. ఎన్ని చిందులు తొక్కినా.. ఓటు బ్యాంకు రాజకీయమే పరమావధి. అయితే.. ఈ విషయంలో చంద్రబాబు మధ్యతరగతి, తన సొంత సామాజిక వర్గాన్ని ఆది నుంచి నమ్ముతూ వచ్చినట్టు జాతీయ మీడియా పేర్కొంది.
అదే మైనస్ అంటూ…..
ముఖ్యంగా తనను తాను సీఈవోగా ప్రజంట్ చేసుకోవడంలో చంద్రబాబు చాలా ఇష్టపడతారని.. అందుకే ఆయన తన హయాంలో అనేక రూపాల్లో రైతులకు, పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలు ప్రవేశ పెట్టినా.. వాటి గురించి చెప్పుకోవడం ఉండదని. కేవలం తాను హైటెక్ సిటీ కట్టానని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని, అమరావతి రాజధానిని సింగపూర్ చేస్తానని ప్రకటించుకోవడానికే పరిమితమయ్యారని జాతీయ మీడియా విశ్లేషించింది. ఇలా.. చంద్రబాబు ప్రకటన.. కేవలం.. మధ్యతరగతి లేదా.. ఉన్నతస్థాయి వర్గాన్ని ఆకట్టుకునేలా ఉంటుందే తప్ప.. పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగాలు ఎన్నడూలేవని.. ఇది రాజకీయంగా ఆయనకు బిగ్ మైనస్ అయిపోయిందనేది జాతీయ మీడియా కథనం.
వాళ్లంతా ఓట్లేసేవాళ్లు కాదట…..
సాధారణంగా.. మధ్యతరగతి.. ఉన్నతస్థాయి వర్గాలు ముందు.. ఆహా ఓహో అన్నా.. ట్విట్టర్‌లో సానుకూల ట్వీట్ చేసినా.. ఫేసు బుక్కుల్లో లైకులు చేసినా.. వాట్సాపుల్లో షేర్ చేసినా.. చంద్రబాబు పొంగి పోయేవారని.. అయితే.. ఓటు బ్యాంకు విషయానికి వచ్చే సరికి మాత్రం ఈ వర్గాలు.. ఏనాడూ.. లైన్‌లో నుంచుని ఓటు వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వవనే విషయం ఎందుకో చంద్రబాబు గుర్తించలేక పోయారని జాతీయ మీడియా పేర్కొంది. ఇక, పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినా.. చంద్రబాబు చెప్పుకోవడానికి బిడియ పడతారని.. తనను తాను తక్కువ చేసుకున్నట్టు ఫీలవుతారని.. ఇదే.. రాజకీయంగా ఆయనను మధ్యతరగతి పొలిటీషియన్‌గా మార్చిందని జాతీయ మీడియా తేల్చి పారేయడం గమనార్హం.