బాబు మారలేదు.. తినేస్తున్నారు.. తమ్ముళ్ల టాక్
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై మళ్లీ తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “ఆయన అప్పట్లో అధికారంలో ఉన్నపుడు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏమీ మారలేదు“ [more]
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై మళ్లీ తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “ఆయన అప్పట్లో అధికారంలో ఉన్నపుడు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏమీ మారలేదు“ [more]
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై మళ్లీ తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “ఆయన అప్పట్లో అధికారంలో ఉన్నపుడు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏమీ మారలేదు“ అంటూ.. పార్టీ సీనియర్ నేతలు వాపోతున్నారు. కేవలం సీనియర్ నేతలు మాత్రమే కాదు గత ఎన్నికల్లో ఓడిన యువనేతల దగ్గర నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలదీ ఇదే మాట. బాబోయ్ చంద్రబాబు బోరు మాటలేంట్రా బాబోయ్ అంటున్నారు. దీనికి కారణమేంటి? చంద్రబాబుపై.. ప్రజల్లో కాదు.. పార్టీ నేతల్లోనే సింపతీ లేదా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సీనియర్ నేతగా….
విషయంలోకి వెళ్తే.. చంద్రబాబుకు ఎంత సీనియర్ అనే పేరు ఉందో.. అదే సమయంలో ఆయనకు మైకు పట్టుకుంటే వదలరు.. అనే పేరు కూడా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏ సందర్భం వచ్చినా.. పార్టీ శ్రేణులతో కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ క్రమంలో ఆయన మైకు అందుకుంటే.. కనీసం నాలుగు గంటలకు తక్కువ కాకుండా మైకును వదిలేవారుకాదు.. చెప్పిందే చెప్పేవారు. పాడిందే పాడే వారు. ఒక్క పార్టీ నేతల విషయమే కాదు.. ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో ఎప్పుడు సెమినార్లు పెట్టినా .. రోజుల తరబడి మైండ్ తినేవారనే కామెంట్లు వినిపించేవి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా…..
జగన్ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్ ఆఫీసర్లు చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు కంపేరిజన్ చేస్తూ జగన్‌ను కీర్తించారు కూడా. జగన్ ఎంత పెద్ద నిర్ణయం అయినా ఫట్‌మని ఐదు నిమిషాల్లో తేల్చేస్తే దానికే చంద్రబాబు సమావేశం పెద్ద ప్రహసనం చేసేవారని కూడా సెటైర్లు వేశారు. సరే! అప్పట్లో అధికారంలో ఉన్నారు కనుక.. అందరూ ఇష్టమో.. కష్టమో.. భరించేవారు. కానీ, ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక, మాట్లాడేందుకు ముఖ్యంగా గంటల తరబడి మాట్లాడేందుకు సబ్జెక్టు ఏముంటుంది ? అనుకున్నారు అందరూ. కానీ, చంద్రబాబు తన తఢాకా ఇప్పుడు కూడా చూపిస్తు న్నారు.
నేతలు చెప్పేది వినకుండా….
నియోజకవర్గాలు, జిల్లాలు, నగరాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా కూడా ఆయన పార్టీ నేతలతో జూమ్ మీటింగులు పెడుతున్నారు. పార్టీ పరిస్థితిపై గంటల కొద్దీ చంద్రబాబు లెక్చర్లు దంచేస్తున్నారట. పోనీ.. ఈ సమయంలో పార్టీ పుంజుకునేందుకు నేతలు ఎవరైనా సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే.. “అంతా నాకు తెలుసు. ముందు నేను చెప్పింది విను!“ అని చురకలు అంటిస్తున్నారట. దీంతో పార్టీ నేతలు.. తల పట్టుకుంటున్నారు. పార్టీ ఎదుగుదలకు సూచనలు చేస్తే.. పట్టించుకోరు. మా బాధలు చెబుదామంటే .. టైం ఇవ్వరు.. చెప్పిందే చెప్పి.. మా మైండ్ తినేస్తున్నారు! అంటూ.. తమ్ముళ్లు తల బాదుకుంటున్నారట.
కాన్ఫరెన్స్ కాల్ అంటేనే?
లోకేష్ కూడా ఇందుకు అతీతం కాదనే పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పైగా ఏదేనా సమస్య ప్రస్తావిస్తే దానిపై పార్టీ నేతలు మాట్లాడుతుంటే నేను అప్పుడు అది చేశాను.. ఇది చేశాను అని చెపుతూ చివరకు పార్టీ నేతలు చెప్పింది మాత్రం ఆయన వినడం లేదట. దీంతో చాలా మంది నేతలు బాబు కాన్ఫరెన్స్ ఉందంటే ఫోన్ సైలెంట్లో పెట్టేసి నిద్రపోవడమో లేదా తమ పనులు తాము చేసుకోవడమే చేస్తున్నారట. కొందరు అయితే పని ఉందని చెప్పి తప్పించుకుంటున్నారట. మొత్తంగా ఈ విషయం టీడీపీలో మరోసారి హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం. మరి చంద్రబాబు తన పంథాను మార్చుకుంటారో లేదో చూడాలి.