బాబు వచ్చాడు… సీన్ మార్చేశాడు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు ఎనిమిది నెలల తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. గత ఏడాది మార్చి నెల నుంచి ఆయన జిల్లాల పర్యటన చేయడం [more]

;

Update: 2021-01-02 08:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు ఎనిమిది నెలల తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. గత ఏడాది మార్చి నెల నుంచి ఆయన జిల్లాల పర్యటన చేయడం లేదు. కరోనా కారణంగా చంద్రబాబు హైదరాబాద్ లోనే ఎక్కువ కాలం ఉండిపోయారు. తాజాగా చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటన క్యాడర్ లో ఉత్సాహం నింపింది. విశాఖ ఎయిర్ పోర్టుకు వేల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకుని తాము అండగా ఉన్నామని చంద్రబాబుకు తెలియజేశారు.

కొత్త స్టయిల్ తో…..

చంద్రబాబు ఈ పర్యటనలో సరికొత్త స్టయిల్ లో వచ్చారు. ఎప్పుడూ చంద్రబాబు విక్టరీ సింబల్ ను చూపిస్తారు. ఈసారి విక్టరీ సింబల్ తో పాటు థమ్స్ అప్ సింబల్ ను కూడా చంద్రబాబు కలిపేశారు. రెండు సింబల్స్ ను చూపిస్తూ చంద్రబాబు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు విశాఖ పర్యటనకు రావడంతో ఆ ప్రాంత నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. పెద్దయెత్తున కార్యకర్తలను మొహరించారు.

మూడు రాజధానుల ప్రకటన తర్వాత….

మూడు రాజధానుల ప్రకటన తర్వాత చంద్రబాబు విశాఖకు రావడం ఇదే తొలిసారి. అయితే ఆయన రామతీర్థం పర్యటనకు రావడంతో రాజధానిపై మాట్లాడే అవకాశం లేదు. ఇప్పటికే విశాఖ నగరం నుంచి ఒక ఎమ్మెల్యే పార్టీని వీడారు. గంటా శ్రీనివాసరావు సైలెంట్ గా సైడయిపోయారు. మరో వైపు ఉత్తరాంధ్రలో పార్టీ నేతలు బయటకు రావడం లేదు. వారిలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు చంద్రబాబు అచ్చెన్నాయుడుకు రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.

పార్టీ నేతలతో…..

ఇక విజయనగరం జిల్లాలో సయితం టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. పార్లమెంటరీ నాయకత్వం బాధ్యతలను కిమిడి నాగార్జునకు అప్పగించడం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ జిల్లా నేతలతో కూడా చంద్రబాబు విడిగా మాట్లాడే అవకాశముంది. రామతీర్థం పర్యటన తర్వాతనే చంద్రబాబు విజయనగరం జిల్లా నేతలతో భేటీ కానున్నట్లు సమాచారం. మొత్తం మీద విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపిందనే చెప్పాలి.

Tags:    

Similar News