తమ్ముళ్లను సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారుగా?
ఏపీలో రాజకీయం మారుతోంది. ఆ మాటకు వస్తే దేశంలోనూ రాజకీయం రంగూ రుచి వాసన పూర్వంలా లేవు. ఇది సోషల్ మీడియా కాలం. జనాలకు అన్ని విషయాలూ [more]
;
ఏపీలో రాజకీయం మారుతోంది. ఆ మాటకు వస్తే దేశంలోనూ రాజకీయం రంగూ రుచి వాసన పూర్వంలా లేవు. ఇది సోషల్ మీడియా కాలం. జనాలకు అన్ని విషయాలూ [more]
ఏపీలో రాజకీయం మారుతోంది. ఆ మాటకు వస్తే దేశంలోనూ రాజకీయం రంగూ రుచి వాసన పూర్వంలా లేవు. ఇది సోషల్ మీడియా కాలం. జనాలకు అన్ని విషయాలూ చాలా బాగా తెలుస్తున్నాయి. మనమేదో అనుకూల మీడియా ద్వారా వండేసి జనం మెదళ్ళలో దాన్ని పంపించి అదే నిజం అనుకోమంటే అసలు కుదిరే కాలం కానే కాదు. కానీ చంద్రబాబు ఇంకా అవుట్ డేటెడ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తూ వస్తున్నారు. ఆయనకు ఎంత సేపూ ఆత్మ స్తుతి. పరనింద అలవాటు అన్నది తెలిసిందే. జగన్ ని మెల్లగా జనంలో చెడ్డ చేస్తే చాలు అధికారం అదే వచ్చి వడిలో పడుతుందని పాతకాలం నాటి రాజకీయ పట్లతో బాబు పోరాడుతున్నారు.
పార్టీని వదిలేసి….
ఏపీలో టీడీపీని ఒక్కసారి అయినా చంద్రబాబు చూసుకున్నారా అన్నదే తమ్ముళ్ళ చర్చ. కొత్త వారికి పదవులు అంటూ చాలా మందికి పంపిణీ చేశారు. అందులో వారసులు కూడా ఉన్నారు. కానీ వారెవరూ అసలు సీన్ లోకి రారు. నోరెత్తరు. తమకు పదవులు అలంకారంగా భావించి సొంత పనులు చూసుకుంటున్నారు. జులుం చేయడానికి మర్యాదల కోసమే పార్టీ పదవులను అట్టే బెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు లాంటి జాతీయ నాయకుడు రామతీర్ధం వంటి ఒక చిన్న గుడిలో జరిగిన దుర్ఘటనకు స్పందించి ఆఘమేఘాల మీద హైదరాబాద్ నుంచి రావాల్సివచ్చింది. చంద్రబాబు అలా వెళ్ళిపోగానే పార్టీ నేతలూ గమ్మున ఇంటి పట్టునుండిపోయారు.
రిపేర్లు అసలు ఉండవా..?
నాయకుడు అన్నాక అన్నీ మంచి పనులే చేయాలని లేదు. టీడీపీ కూడా కొన్ని మంచి పనులు చేసి ఉండవచ్చు కానీ మరికొన్ని చెడ్డ పనులు కూడా చేసిందిగా. అందువల్లనే ఆ పార్టీని జనం పక్కన పెట్టారు. మరి చంద్రబాబు వంటి సీనియర్ ఏం చేయాలి. పార్టీ సమవేశాలు పెట్టిన తరువాత ముందుగా తమ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది ఒక్కసారి అయినా చూసుకోవాలి కదా . తమ ప్రభుత్వం గత పాలనలో చేసిన తప్పులను కూడా చర్చించి ఆత్మ విమర్శ చేసుకోవాలి. కానీ అది ఏమైనా ఇప్పటిదాకా జరిగిందా అంటే లేదు అనే మాట వస్తుంది. చంద్రబాబు ఎంతసేపూ జగన్ ని చూపించి ఘాటు విమర్శలు చేస్తూ పార్టీని తమ్ముళ్లను సైడ్ ట్రాక్ లో పెడుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.
ఆ ధీమా మంచిదేనా..?
ఏపీలో జగన్ బదనాం అయితే కచ్చితంగా జనం టీడీపీనే ఎన్నుకుంటారని చంద్రబాబుకు ఉన్న అతి ధీమాగా కనిపిస్తోంది. కానీ రెండు రెళ్ళు నాలుగు అన్నది అంకె గణితం. రాజకీయ గణితంలో ఒక్కోసారి ఆరు కూడా కావచ్చు. ఇపుడు ఏమీ కాకుండా పోయిన జనసేన, బీజేపీ కూటమి కూడా రేపటి రోజున ఏపీలో గట్టిగానే పుంజుకోవచ్చు. అపుడు ఆ పార్టీ వైపుగానూ ప్రజలు చూసే ఛాన్సు కూడా ఉంటుంది. ఇక పార్టీలో తప్పు ఒప్పులు సరి చేసుకుని జనాలకు గట్టి భరోసా ఇవ్వకపోతే 2019లో ఓడించిన టీడీపీనే మళ్లీ నెత్తిన పెట్టుకోవడానికి ఆంధ్ర ప్రజలు ఎందుకు ముందుకు వస్తారు అన్నది కూడా ఆలోచించాలి కదా. కానీ చంద్రబాబు అర్భాటంగా పొలిట్ బ్యూరో మీటింగులు రాష్ట కమిటీ మీటింగులు పెడతారు కానీ అసలు విషయాలను మాత్రం అలా కావాలనే వదిలేస్తారు అంటున్నారు. మరి ఇలాగైతే సైకిల్ పరుగులు ఎలా బాబూ అని సగటు తమ్ముడు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు నుంచి జవాబు ఉందా.