బాబుకు మీడియా స్వేచ్ఛ ఇప్పుడు గుర్తుకు వచ్చిందే …?

మీడియా మేడ్ బేబీ దేశం లో ఎవరంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేరు అంతా ఠక్కున చెప్పేస్తారు. ప్రజల్లో అంతులేని మద్దతు కలిగిన మహా వృక్షం లాంటి [more]

Update: 2021-02-02 11:00 GMT

మీడియా మేడ్ బేబీ దేశం లో ఎవరంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేరు అంతా ఠక్కున చెప్పేస్తారు. ప్రజల్లో అంతులేని మద్దతు కలిగిన మహా వృక్షం లాంటి మామ ఎన్టీఆర్ నే మీడియా మద్దతుతో చంద్రబాబు పెకలించి ఆయన సీటు ఆక్రమించారన్నది జగమెరిగిన సత్యమే. నాటి వెన్నుపోటు ఘట్టాన్ని సైతం ప్రజాస్వామ్య పోరాటంగా కూడా ఆయన చిత్రించగలిగారంటే దాని వెనుక ఆయన్ను పెంచి పోషించిన మీడియానే. ఎంతో చరిష్మా కలిగిన ఎన్టీఆర్ సైతం జామాత దశమగ్రహం ఆడియో క్యాసెట్ లోను ఒక టివి ఇంటర్వ్యూలో ఈ విషయాలను స్వయంగా ఎన్టీఆర్ వెల్లడించారు. నాడు మీడియా తన అల్లుడికి కొమ్ము కాయడం పై ఆయన ఖిన్నులయ్యారు కూడా.

బాబు హయాంలో కూడా …

చంద్రబాబు హయాంలో మీడియా పై ఆధిపత్యం మరీ దారుణంగానే కొనసాగింది. తనకు అనుకూలంగా లేని ఛానెల్స్ ప్రసారాలు కాకుండా ఆయన టీం అడ్డుకోవడం అందరికి తెలిసిందే. ఇందులో ఒక ఉదాహరణ ఎన్టీవీ. లోకేష్ కోసం ఎన్టీవీ లో వచ్చిన కార్యక్రమం పై ఆగ్రహించిన చంద్రబాబు ఆ ఛానెల్ ను చాలా కాలం ఎపి లో బ్లాక్ చేశారు. లోకేష్ పై చర్చ పెట్టిన షో ను నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ (కె ఎస్ ఆర్ ) ను తొలగిస్తే తప్ప ఎన్టీవీ ప్రసారాలు పునరుద్ధరణ కాలేదు. అకారణంగా తొలగించిన కె ఎస్ ఆర్ ను సాక్షి ఛానెల్ అక్కున చేర్చుకుంది.

జగన్ దెబ్బతో …

జగన్ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు అనుకూల మీడియా నే మెజారిటీగా ఎపి లో నడుస్తుంది. అయితే అధికారపార్టీ పెట్టే కేసులతో ఇటీవల చంద్రబాబు అనుకూల మీడియా సైతం జంకుతుంది. దాంతో చంద్రబాబు ఇప్పుడు మీడియా స్వేచ్ఛ కోసం తరచూ పాఠాలు వల్లిస్తున్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే పోరాటం చేయాలా ? మీడియా స్వేచ్ఛ కోసం మరిచిపోయారా ? ఛానెల్స్ ను బంద్ చేస్తారని భయపడితే ఎలా అంటూ రకరకాలుగా క్లాస్ లు తీసుకోవడం గమనార్హం. అధికారం నుంచి దిగిన తరువాత కానీ ఆయన మీడియా స్వేచ్ఛ గుర్తుకు రాలేదా పైగా ఆయన పవర్ లో ఉన్నప్పుడు చేసింది ఏమిటి అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా నడుస్తుంది.

Tags:    

Similar News