బాబుకు ఎఫెక్ట్‌: అప్పుడు క్రిస్టియ‌న్లు.. ఇప్పుడు వాళ్లు?

ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డం అంటే ఇదే అంటున్నారు ప‌రిశీలకులు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయ‌త్నాలు చేస్తున్నారు., [more]

;

Update: 2021-02-05 09:30 GMT

ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డం అంటే ఇదే అంటున్నారు ప‌రిశీలకులు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయ‌త్నాలు చేస్తున్నారు., అయితే ఇలా చేస్తున్న ప్రయ‌త్నాల్లో కొన్ని విక‌టించి.. ఆయ‌న‌కు ఇబ్బందిగా ప‌రిణ‌మిస్తున్నాయి. కొన్నిరోజుల కింద‌ట‌ ఆల‌యాల‌పై జ‌రుగుతున్న వ‌రుస దాడుల‌పై తీవ్రస్థాయిలో ఫైరైన చంద్రబాబు రామ‌తీర్థం ఘ‌ట‌న‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో ప‌ర్యటించారు. ఈ క్రమంలో సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శలు గుప్పించారు. ఆయ‌న క్రిస్టియ‌న్ ముఖ్యమంత్రి కాబ‌ట్టే.. హిందూ ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని వివాదాస్పద వ్యాఖ్యలు చంద్రబాబు చేశారు.

బాబు పై ఆగ్రహంతో……

అంత‌టితో ఆగ‌కుండా క్రిస్టియ‌న్ కులానికి చెందిన పాస్టర్లకు నెల‌నెలా రూ.5000 చొప్పున ప్రజాధ‌నాన్ని దోచిపెడుతున్నార‌ని దుయ్యబ‌ట్టారు. దీంతో క్రిస్టియ‌న్ స‌మాజం నుంచి చంద్రబాబుపై తీవ్ర విమ‌ర్శలు వ‌చ్చాయి. కొంద‌రు టీడీపీ నుంచి కూడా బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. దీంతో ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు మ‌ళ్లీ చంద్రబాబు చాలా ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. ఇప్పటికీ.. క్రిస్టియ‌న్లలో చంద్రబాబుపై ఆగ్రహం పోలేదు. ఇదిలావుంటే.. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో చంద్రబాబు త‌న పార్టీ నేత‌ల‌ను ఉద్యోగుల పై విరుచుకు‌ప‌డేలా చేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ముఖ్యంగా విజ‌య‌వాడ‌కు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభి రాం.. వ‌రుస‌గా.. ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తున్నారు.

ఉద్యోగులు కూడా….?

స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో త‌మ‌కున్న అభ్యంత‌రాల‌ను వ్యక్తం చేస్తూ అన్ని ఉద్యోగ సంఘాల నాయ‌కులు కూడా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను విమ‌ర్శించారు. ఆయ‌న ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితిని అర్ధం చేసుకోవ‌డం లేద‌ని అన్నారు. ఈ క్రమంలోనే వారు కూడా సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ ప‌రిణామాల‌తో ఎన్నిక‌లు ఎక్కడ ఆగిపోతాయ‌ని అనుకున్నారో.. ఏమో చంద్రబాబు వెంట‌నే ఉద్యోగుల‌పై విమ‌ర్శలు చేయించార‌నేది ఉద్యోగ సంఘాల నేత‌ల వాద‌న‌. ప‌ట్టాభి మ‌రింత రెచ్చిపోయి.. ఉద్యోగ సంఘం నాయ‌కుడు వెంక‌ట్రామి రెడ్డిపై ఒరేయ్‌.. అరేయ్‌.. అంటూ.. దూకుడు ప్రద‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏ ఉద్యోగిని క‌దిలించినా.. టీడీపీ వ‌ల్ల మాకు అన్నీ తిప్పలే.. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది మ‌రింత ముదిరి.. టీడీపీకి మ‌రోసారి ఉద్యోగులు దూర‌మ‌య్యే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News