బాబుకు ఆయుధం దొరికిందా ? పంచాయతీ పోరులో కొత్త ట్విస్ట్
రాష్ట్రంలో పంచాయతీ పోరు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూకుడు పెంచేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అయితే.. ఇప్పటి వరకు ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితిని [more]
;
రాష్ట్రంలో పంచాయతీ పోరు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూకుడు పెంచేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అయితే.. ఇప్పటి వరకు ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితిని [more]
రాష్ట్రంలో పంచాయతీ పోరు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూకుడు పెంచేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అయితే.. ఇప్పటి వరకు ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే.. టీడీపీకి అంత సానుకూల పవనాలు అయితే వీచడం లేదు. ఎందుకంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 130కి పైగా నియోజకవర్గాల్లో నాయకత్వ లేమి.. స్పష్టంగా కనిపిస్తోంది. నాయకులు ఉన్న చోట కూడా ఒకరితో ఒకరు కీచులాడుకుంటున్నారు. ఆధిపత్య పోరు తీవ్రంగా సాగుతోం ది. అదే సమయంలో అసంతృప్తి కూడా పార్టీలో విభేదాలకు కారణమవుతోంది.
47 నియోజకవర్గాల్లో…..
ఈ పరిణామాలే గత సాధారణ ఎన్నికల్లో పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక, ఇప్పుడు పంచాయతీ పోరులోనూ ఇదే తరహా పరిస్తితి ఎదరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మాటకు వస్తే 47 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లు ఏ మాత్రం యాక్టివ్‌గా లేరని చంద్రబాబు ఇటీవల స్వయంగా చెప్పారు. మొత్తంగా చూస్తే.. టీడీపీకి ఆశించినమేరకు ఫలితం దక్కేలా కనిపించడం లేదు. బహుశ ఈ విషయం.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలిసిపోయిందో ఏమో.. వెంటనే ఆయన ప్లేట్ మార్చారు. టీడీపీ ఓడిపోయినా అంటే.. మెజారిటీ గ్రామ పంచాయతీలను రాబట్టుకోలేక పోయినా.. లేక..వైసీపీ సాధారణ ఎన్నికల్లో లాగానే వార్ వన్ సైడ్ చేసి భారీ సంఖ్యలో పంచాయతీలను కైవసం చేసుకున్నా.. టీడీపీని రక్షించుకునే మార్గం దిశగా చంద్రబాబు ఆలోచన చేశారు. అదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
అలా అయితే ఇలా…..
ఆది నుంచి కూడా రాజకీయ వ్యూహాలు వేయడంలో చంద్రబాబు.. తనకు తానే సాటి అన్న విధంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక, తాజా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అనుకూలురు భారీ సంఖ్యలో పంచాయతీలు కైవసం చేసుకుంటే వైసీపీపై రెండేళ్లు రాకుండానే వ్యతిరేకత పెరిగిపోయిందని… జగన్ పాలనకు వ్యతిరేకతగా ప్రచారం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో రేపు టీడీపీకి వ్యతిరేకత వస్తే.. బలవంతపు ఏకగ్రీవాలు చేయిం చారని.. ఎన్నికల్లో అవినీతి చోటు చేసుకుందని.. ఇలా జగన్‌పై నిందలు వేసేందుకు రెడీ అయ్యారు. మరోవైపు.. పంచాయతీల్లో ఏకగ్రీవాలు సహజం. అయితే.. ఇలా జరిగేందుకు ఛాన్స్ ఇవ్వొద్దంటూ.. టీడీపీ నేతలనే చంద్రబాబు ఆదేశించడం.. గమనార్హం. ఏదేమైనా… అయితే అటు-కాకుంటే ఇటు! అన్న విధంగా చంద్రబాబు వైఖరి ఉందని అంటున్నారు పరిశీలకులు.