ఆ కుర్చీ భ్రమను ఇంకా వదులుకోకుంటే ఎలా?
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉందామనుకున్నారు. కానీ ఐదేళ్లు అయిపోయిన వెంటనే జనం వెనక్కు పంపారు. దీనిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. తాను తప్ప ఆ [more]
;
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉందామనుకున్నారు. కానీ ఐదేళ్లు అయిపోయిన వెంటనే జనం వెనక్కు పంపారు. దీనిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. తాను తప్ప ఆ [more]
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉందామనుకున్నారు. కానీ ఐదేళ్లు అయిపోయిన వెంటనే జనం వెనక్కు పంపారు. దీనిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. తాను తప్ప ఆ కుర్చీలో ఎవరూ కూర్చోకూడదనే భావనలో ఉన్నారు. ఆ కుర్చీ తనకే సొంతమన్నది చంద్రబాబు ఊహించుకున్నారు. కానీ అది ఊహగానే మిగిలిపోతున్న సమయంలో చంద్రబాబు రాజకీయంగా మరింత దిగజారారనిపిస్తుంది. ఏ చిన్న సంఘటన జరిగినా దానిని జగన్ కు ముడిపెడుతూ రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు.
ఐదేళ్ల తన పాలనలో….
చంద్రబాబు ఐదేళ్లు ఎలా పాలించారో తెలియంది కాదు. ఆయనకు అప్పుడు గుర్తుకు రాని సమస్యలు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. గ్రామ పంచాయతీకి ఏడాదికి కోటి రూపాయలు కేంద్రం నిధులు వస్తున్నాయని చెబుతున్నారు. ఆయన పాలన సాగించినప్పుడు మాత్రం కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి అస్సలు మాట్లాడరు. అంతా తన ఘనతే అని చాటుకోటానికే ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపైన కూడా తన స్టిక్కర్ వేసుకుని మరీ ప్రచారాన్ని పొందారు. ఇప్పుడు మాత్రం కేంద్రం మంచిది. నిధులు దండిగానే ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వమే దానిని సక్రమంగా వినియోగించడం లేదని ఊదరగొడుతున్నారు.
ఏది జరిగినా…?
ఇక మొన్నటి వరకూ ఆలయాలపై వరస దాడులు జరిగేవి. కాని కొన్ని అరెస్ట్ లతో ప్రస్తుతం ఆలయాలపై దాడులు హటాత్తుగా ఆగిపోయాయి. మరి దీనికి ఎవరు కారణం అన్నదానిపై సోషల్ మీడియాలో జోరుగానే చర్చ జరుగుతుంది. ఇక నిమ్మాడలో అచ్చెన్నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తన భార్యకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకూడదని అచ్చెన్నాయుడు బెదిరింపులకు దిగారు. అచ్చెన్నాయుడు బెదిరింపులను మాత్రం చంద్రబాబు ఖండిచరు.
ఓపిక లేకనేగా?
కానీ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇరవై నెలలుగా చూస్తే జగన్ ను సక్రమంగా తాను అనుకున్న రీతిలో ఎక్కడ పాలన చేయించారన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వాటి ద్వారా అడ్డుకుంటూ జగన్ ను జనం గెలిపించినా తన తడాఖా ఏందో తెలుసుకోమని ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నారు. ఏది ఏమైనా మరో మూడేళ్లు చంద్రబాబు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ప్రజల్లో నిజంగా వ్యతిరేకత వస్తే జగన్ ను కూడా ఇంటికి పంపుతారు. అంతవరకూ ఆగలేక ఇలా ఫ్రస్టేషన్ కు లోనవుతుంటే అభాసుపాలు కావడమే కాదు.. మరోసారి అపజయమూ తప్పదు.