ఇక చంద్రబాబు వంతు.. త్వరలో హస్తినకు…?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో సమావేశమవ్వడానికి ఆయన రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికకు ముందే చంద్రబాబు [more]

;

Update: 2021-02-15 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో సమావేశమవ్వడానికి ఆయన రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికకు ముందే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలసి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించాలని చంద్రబాబు నిర్ణయించారని సమాచారం.

తెగదెంపులు చేసుకున్న తర్వాత….

చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నారు. బీజేపీ పైన, ప్రధాని మోదీపైన వ్యక్తిగత విమర్శలకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పర్యటనలు చేశారు. ఢిల్లీలో జాతీయ మీడియా ఎదుట మోదీపై నిప్పులు చెరిగారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు ఢిల్లీలో కాలుమోపలేదు. ఇటు కాంగ్రెస్ బలహీనంగా ఉండటం, బీజేపీ అధికారంలో ఉండటంతో ఆయన హస్తిన వైపు చూడటం మానుకున్నారు.

తప్పిదమేనని అంగీకరించి….

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు బీజేపీతో సయోధ్యకే ప్రయత్నించారు. తాను బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం తప్పిదమేనని చంద్రబాబు అంగీకరించారు. అప్పటి నుంచి బీజేపీ, మోదీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు. మోదీకి అప్పుడప్పుడు లేఖలు రాస్తూ కొంత గ్యాప్ ను తగ్గించే ప్రయత్నం చేశారు. తాజాగా టీడీపీ పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి అమిత్ షాను కలసి వైసీప ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను వివరించారు.

అపాయింట్ మెంట్ కోసం….

అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడంతో నేరుగా చంద్రబాబు ఢిల్లీ బయలుదేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే మోదీ, అమిత్ షాలను కలసి మాట్లాడాలని భావిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు వారి అపాయింట్ మెంట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కు వారి అపాయింట్ మెంట్ కనుక లభిస్తే ఏపీలో రాజకీయ పరిణామాల్లో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. మరి మోదీ, షాలు అపాయింట్ మెంట్ చంద్రబాబుకు ఇస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News