బాబులో కొత్త ఆశలు.. ఆ సర్వే రిపోర్ట్ తోనేనట
తిరుపతి ఉప ఎన్నికపై చంద్రబాబు బాగా ఆశలు పెట్టుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే పంచాయతీ ఎన్నికలు ముందుగా జరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఎన్నికలపై ఉంటుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. [more]
తిరుపతి ఉప ఎన్నికపై చంద్రబాబు బాగా ఆశలు పెట్టుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే పంచాయతీ ఎన్నికలు ముందుగా జరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఎన్నికలపై ఉంటుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. [more]
తిరుపతి ఉప ఎన్నికపై చంద్రబాబు బాగా ఆశలు పెట్టుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే పంచాయతీ ఎన్నికలు ముందుగా జరిగిపోవడంతో ఆ ప్రభావం ఈ ఎన్నికలపై ఉంటుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు నేతలను తిరుపతి ఉప ఎన్నికకు చంద్రబాబు సమాయత్తం చేస్తున్నారు. రోజు విడిచి రోజు వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టి నియోజకవర్గంలో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు.
గెలుపు అవసరమే అయినా…..
తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు చంద్రబాబుకు అవసరం. జగన్ దూకుడును నిలువరించాలంటే తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని చంద్రబాబు నమ్ముతున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో ప్రత్యేకంగా ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మను వినియోగిస్తున్నారంటే చంద్రబాబు ఈ ఎన్నికను ఎంత ప్రిస్టేజియస్ గా తీసుకున్నారో చెప్పకనే తెలుస్తుంది.
నియోజకవర్గాల వారీగా సర్వే….
ఇప్పటికే రాబిన్ శర్మ బృందం అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సర్వే నివేదికలను చంద్రబాబు కు అందించినట్లు తెలిసింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో శ్రీకాళహస్తి మినహా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుందన్న నివేదిక వచ్చింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వైసీపీ పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లోనూ కొంత వ్యతిరేకత జగన్ ప్రభుత్వంపై కన్పిస్తుందని రాబిన్ శర్మ టీం ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
వైసీపీ వీక్ అయిందని….
దీంతో చంద్రబాబు మరింత ఉత్సాహంతో ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నిక కోసం ఇప్పటికే మండలాల వారీగా ఇన్ ఛార్జులను నియమించారు. ప్రత్యేకంగా వార్ రూమ్ నుకూడా చంద్రబాబు ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అవసరమైతే తాను తిరుపతిలోనే మకాం వేస్తానని కూడా చంద్రబాబు నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రాబిన్ శర్మ టీం నివేదిక చంద్రబాబులో కొత్త ఉత్సాహం నింపిందంటున్నారు.