నో… రివ్యూస్… ఇంకో ఆప్షన్ లేదట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కాలం కలసి రావడం లేదు. అసలే పార్టీ కష్టాల్లో ఉండటం, నేతలు యాక్టివ్ గా లేకపోవడంతో పంచాయతీ ఎన్నికలు కలసి వస్తాయని [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కాలం కలసి రావడం లేదు. అసలే పార్టీ కష్టాల్లో ఉండటం, నేతలు యాక్టివ్ గా లేకపోవడంతో పంచాయతీ ఎన్నికలు కలసి వస్తాయని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కాలం కలసి రావడం లేదు. అసలే పార్టీ కష్టాల్లో ఉండటం, నేతలు యాక్టివ్ గా లేకపోవడంతో పంచాయతీ ఎన్నికలు కలసి వస్తాయని చంద్రబాబు భావించారు. పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా అధిక స్థానాలను గెలుచుకుంటామని చంద్రబాబు ఆశించారు. కానీ పంచాయతీ ఎన్నికలు చంద్రబాబు ఆశలు అడియాసలు చేశాయి. అంతేకాదు పార్టీ పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి ఏర్పడింది.
మొన్నటి వరకూ ఉత్సాహంగా….
పంచాయతీ ఎన్నికల వేళ చంద్రబాబు ఉత్సాహంగా కన్పించారు. ఎవరూ భయపడకుండా ముందుకు రావాలని పదే పదే పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కానీ అనేక చోట్ల నియోజకవర్గ స్థాయి నేతలు పట్టించుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకుంటే ఆర్థికంగా ఆదుకోవాల్సి ఉంటుందని కీలక నేతలందరూ ముఖం చాటేశారు. అయినా ఎలాగోలో అత్యధిక స్థానాల్లోనే చంద్రబాబుపార్టీ మద్దతుదారులు ఉండేలా చూసుకోగలిగారు.
మరో ఆప్షన్ లేదు….
కానీ ఫలితాలు వచ్చే సరికి నీరసం వచ్చేసింది. దాదాపు 80 శాతం పోలింగ్ జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చినా అనుకూల తీర్పు మాత్రం రాలేదు. ఇప్పుడు చంద్రబాబు ఎవరీనీ ఏమీ అనలేని పరిస్థితి. అధికార పార్టీ వైసీపీ దౌర్జన్యాలు, అక్రమాలని ఆక్రోశించడం తప్ప చంద్రబాబు వద్ద మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే తన సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకు చేదు అనుభవం మిగిలింది.
ఎవరినీ ఏమీ అనలేక….
కుప్పం నియోజకవర్గంలో ఫలితాలు చంద్రబాబు కూడా ఊహించలేదు. ప్రజలంతా తనవైపే ఉన్నారనుకున్నారు. కానీ 90 శాతం పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు సమీక్ష జరుపుతారు. ఈఎన్నికల్లో సమీక్ష చేయడానికి కూడా ఏమీ మిగలలేదు. సొంత నియోజకవర్గంలోనే ఓటమి ఎదురుకావడంతో చంద్రబాబు ఇక ఏ నేతను వేలెత్తి చూపలేని పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ ఎన్నికలు చంద్రబాబుకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయని చెప్పక తప్పదు.