అప్పుడు కాదు.. ఇప్పుడు రెచ్చిపో.. వర్కవుట్ అవుతుందేమో?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. మంచి స్ట్రాటజిస్ట్ గా పేరున్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం విషయంలో మాత్రం ఒకింత [more]

;

Update: 2021-03-12 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. మంచి స్ట్రాటజిస్ట్ గా పేరున్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం విషయంలో మాత్రం ఒకింత వెనకడుగు వేస్తున్నారు. ఈ కారణంగానే సానుకూల ఫలితాలు రావడం లేదంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంపై మునుపటిలా తిరగబడితే ప్రజలు అండగానిలిచే అవకాశముంది. అయితే ఆ దిశగా మాత్రం చంద్రబాబు ప్రయత్నించడం లేదు.

తనకు అనుకూలంగా….

నిజానికి చంద్రబాబుకు ఇప్పుడు పోయేదేమీ లేదు. కేవలం 19 మంది ఎమ్మెల్యేలతో ఉన్నానట్లుగా ఉన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఎప్పుడు పోతుందో తెలియదు. ఇక వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును కార్నర్ చేస్తుంది. ఎక్కడ పర్యటనలు చేసినా అడ్డుకుంటోంది. చంద్రబాబుకు ఒకరకంగా ఇది కలసి వచ్చే అంశమే. ఆ వయసులో చంద్రబాబును పోలీసులు నిర్భంధించినా అది జగన్ ప్రభుత్వంపై ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. చంద్రబాబుకు అనుకూలంగా మారుతుంది.

మోదీ ప్రభుత్వంపై….

ఇక మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా వ్యక్తమవుతోంది. పెట్రోలు ధరలు, వంట గ్యాస్ సిలెండర్ ధరలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో పాటు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి కూడా మోదీ వైఖరి కారణమన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, ప్రత్యేక హోదా, పోలవరం నిధుల విడుదల వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరించడం లేదు. దీంతో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంతో పాటు మోదీపై కూడా యుద్ధం ప్రకటించాల్సి ఉంది.

గతంలో ఎన్నికలకు ముందు….

గతంలో ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇవ్వలేదని మంత్రి వర్గం నుంచి తప్పుకుని చంద్రబాబు బీజేపీకి గుడ్ బై చెప్పారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. గతంలో మాదిరి చంద్రబాబు మోదీకి వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేస్తే మళ్లీ బాబు పార్టీకి క్రేజ్ పెరిగే అవకాశముంది. అయితే ఆ దిశగా చంద్రబాబు ప్రయత్నించడం లేదన్న ఆరోపణలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు క్యాష్ చేసుకోలేకపోతున్నారు.

Tags:    

Similar News