టీడీపీలో మళ్లీ జోష్… కారణం అదేనట

తెలుగుదేశం పార్టీ నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గత కొంతకాలంగా నాయకత్వం లేక ఇబ్బందులు పడుతుంది. ఉన్న నేతలు కూడా పార్టిని [more]

Update: 2021-03-21 06:30 GMT

తెలుగుదేశం పార్టీ నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గత కొంతకాలంగా నాయకత్వం లేక ఇబ్బందులు పడుతుంది. ఉన్న నేతలు కూడా పార్టిని వీడివెళ్లిపోగా, మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మినహా నెల్లూరు జిల్లా నేతలు పెద్దగా యాక్టివ్ గా లేరు. మరోవైపు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుంది.

నెల్లూరు జిల్లా నేతలతో…..

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా నేతలతో విడివిడిగా ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. వారు యాక్టివ్ గా లేకపోవడానికి కారణాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశముందని, ఇప్పటి నుంచి కష్టపడకపోతే రానున్న ఎన్నికల్లో నెగ్గుకు రావడం కష్టమని చంద్రబాబు నేతలకు హితబోధ చేశారంటున్నారు. మాజీ మంత్రి నారాయణతో కూడా చంద్రబాబు ఫోన్ లో మాట్లాడినట్లు చెబుతున్నారు.

నాలుగు నియోజకవర్గాల నేతలను…..

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నెల్లూరు జిల్లాలో నాలుగు నియోజకవర్గాలున్నాయి. సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలున్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు అవసరమైన ఆర్థిక భారాన్ని మొత్తం కేంద్ర పార్టీయే భరిస్తుందని, కేవలం ఎన్నికల ప్రచారం, వ్యూహ, ప్రతివ్యూహాలకు పరిమితమైతే చాలని చంద్రబాబు వారిని కోరినట్లు తెలిసింది.

విడివిడిగా మాట్లాడుతూ…..

వీరితో పాటు చంద్రబాబు ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల నేతలు బొల్లినేని కృష్ణయ్య బొల్లినేని రామారావు తదితరులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిసింది. తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు గెలవక పోయినా కనీస పనితీరును ప్రదర్శించాలని భావిస్తున్నారు. సొంత జిల్లా కావడంతో ఆయన ఎప్పటికప్పుడు నేతలను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక కోసం ఇప్పటికే 70 మందిని ఇన్ ఛార్జులుగా నియమించిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకూ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో తిరుపతి ఉప ఎన్నికను గురించి పట్టించుకోని నేతలు ఇప్పుడు చంద్రబాబు పిలుపుతో తిరిగి యాక్టివ్ అవుతున్నారు.

Tags:    

Similar News