బాబు ఎందుకు పంథా మార్చేశారు … ?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి దాదాపు రెండేళ్ళు అవుతుంది. అయినా ఆయన నాటి పరాభవాన్ని మరచిపోలేక పోతున్నట్లు తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు [more]
;
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి దాదాపు రెండేళ్ళు అవుతుంది. అయినా ఆయన నాటి పరాభవాన్ని మరచిపోలేక పోతున్నట్లు తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు [more]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి దాదాపు రెండేళ్ళు అవుతుంది. అయినా ఆయన నాటి పరాభవాన్ని మరచిపోలేక పోతున్నట్లు తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అర్ధం పడుతున్నాయి. పంచాయితీ ఎన్నికలు మొదలు మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కొత్త తరహా ప్రచారం ఎపి లో హాట్ టాపిక్ గా మారింది. ఇక సోషల్ మీడియా లో పెద్ద చర్చకే దారి తీసింది. నలభై ఏళ్ళ రాజకీయ అనుభవజ్ఞుడైన చంద్రబాబేనా ఇలా అంటున్నది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో కూడా తెరతీసేలా చేసింది.
తప్పు ప్రజలదే …
చంద్రబాబు ఏమి అనుకుంటే అదే ప్రజలు అనుకునేలా అభిప్రాయం ఉత్పత్తి చేయడం లో మాస్టర్స్ డిగ్రీ చేశారనే చెప్పొచ్చు. ఆయన వ్యాఖ్యలకు చేదోడు వాదోడుగా సొంత మీడియా సపోర్ట్ ఎలానూ ఉంటుంది. దాంతో తన భావజాలం ప్రజల్లో చొప్పించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యనే అంటారు విశ్లేషకులు. తాజా ఎన్నికల ప్రచారంలో గత ఎన్నికల్లో టిడిపి ని ఓడించడం ద్వారా ప్రజలు తప్పు చేశారనే భావనను బలంగా తీసుకువెళుతున్నారుచంద్రబాబు. ముద్దులకు మురిసిపోయారు ఇప్పుడు మీకు పిడిగుద్దులు చూస్తున్నారా , మీకు సిగ్గు శరం ఉంటె వైసిపి కి ఓటు వేయొద్దని పలు రకాలుగా రెచ్చగొడుతున్నారు.
కుప్పం లో దెబ్బతిన్నాక …
చంద్రబాబు ఎన్నికల సభల్లో ప్రసంగాలు గతానికి భిన్నంగా విభిన్నంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం లో పంచాయితీ ఎన్నికల్లో గట్టిగా తగిలిన దెబ్బల తరువాత ఆయన తీరే పూర్తిగా మారిపోయింది. తప్పంతా ప్రజలదే అన్న రీతిలో చంద్రబాబు దూకుడుగా ప్రసంగిస్తున్నారు. అయితే ఈ తరహా ప్రచారం టిడిపి పై ఓట్లు కురిపిస్తాయా అంటే మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో తెలిసి పోయింది. ఈ ఎన్నికల్లో కూడా మరోసారి తేడా కొట్టింది కాబట్టి ఇంకో కొత్త దారికి రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు తెరతీసే ఛాన్స్ లేకపోలేదు.