బాబుకు చుక్కలు చూపిస్తోన్న సొంత జిల్లా ?

సాధార‌ణంగా ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌న్న సామెత ఎక్కువుగా వాడుతూ ఉంటాము. కానీ టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విష‌యంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జ‌రుగుతోంది. [more]

Update: 2021-03-25 14:30 GMT

సాధార‌ణంగా ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌న్న సామెత ఎక్కువుగా వాడుతూ ఉంటాము. కానీ టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విష‌యంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జ‌రుగుతోంది. ఆయ‌న అప్పుడెప్పుడో 1978లో త‌ప్పా ఆయన సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరిలో త‌ప్పా బాబు ఎప్పుడూ గెల‌వ‌లేదు. ఇక టీడీపీ కూడా 1994లో మాత్ర‌మే ఇక్క‌డ విజ‌యం సాధించింది. 27 ఏళ్లుగా చంద్రబాబు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి దిక్కూ మొక్కూ లేదు. అస‌లు పార్టీకి ఇక్కడ బ‌ల‌మైన నాయ‌కుడే లేడు. ఏ నాయ‌కుడు అయినా రాజ్యాన్ని లేదా రాష్ట్రాన్ని ఏలాలని త‌ప‌న ప‌డేందుకు ముందు త‌న సొంత ప్రాంతంలో లేదా సొంత నియోజ‌క‌వ‌ర్గం, జిల్లాలో తిరుగులేని హీరో అవ్వాలి.

సొంత నియోజకవర్గంలోనూ….

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల విష‌య‌నికి వ‌స్తే రెండున్నర ద‌శాబ్దాలుగా అక్క‌డ టీడీపీకి ఏ మాత్రం స్కోప్ లేకుండా చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు మించి గెలిచే ప‌రిస్థితి లేదు. జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లోనూ ఎప్పుడూ 50 – 90 వేల మ‌ధ్యలో వైఎస్ ఫ్యామిలీ మెజార్టీలు ఉంటున్నాయి. చంద్రబాబు సొంత నియోజ‌క‌వ‌ర్గమే కాదు.. ఆయ‌న సొంత జిల్లాలోనూ టీడీపీ ప‌రిస్థితి చాలా ఘోరంగా ఉంటోంది. అస‌లే చిత్తూరులో పార్టీ ప‌రిస్థితి అంతంత మాత్రం.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ….

ఇక గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ఆ జిల్లాలో పార్టీ ఓ పంచాయ‌తీలో గెలిస్తే గొప్ప అన్నంత దీన‌స్థితికి ప‌డిపోయింది. జిల్లాలో కీల‌క నేతలు అంద‌రూ ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిపోతుండ‌డంతో అంద‌రూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మొన్న ఎన్నిక‌ల్లో చంద్రబాబు మాత్రమే కుప్పంలో గెలిచారు. ఇక మొన్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ.. తాజా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ పార్టీ ప‌రిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చెప్పలేని ప‌రిస్థితి. జిల్లాలో రెండు కార్పొరేష‌న్లు ఉంటే చిత్తూరులో 50కు 37 చోట్ల వైసీపీ ఏక‌గ్రీవం చేసుకుంది. తిరుప‌తిలో 50 డివిజ‌న్లకు 27 ఇప్పటికే వైసీపీ ఏక‌గ్రీవంగా గెలుచుకుంది. ఈరెండు కార్పొరేషన్లను వైసీపీ సొంతం చేసుకుంది.

ముందు ముందు….

పుంగ‌నూరు మున్సిపాల్టీని మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఏక‌గ్రీవంగా స్వీప్ చేసుకుంది. ఇక పంచాయ‌తీల్లో 80 శాతం వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోగా… చంద్రబాబు సొంత ఊరులోనే గెలిచేందుకు అష్టక‌ష్టాలు ప‌డాల్సి వ‌చ్చింది. మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత చిత్తూరు జిల్లాలో చంద్రబాబుతో పాటు టీడీపీ ప‌రిస్థితి ఇంకెంత దిగ‌జారిపోతుందో ? అన్న ఆవేద‌న‌తో పార్టీ నేత‌లు ఉన్నారు.

Tags:    

Similar News