మున్సిపాలిటీలు కూడా ముంచేశాయే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మున్సిపల్ ఎన్నికలు కూడా కలసి రాలేదు. అన్ని జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని దారుణంగా దెబ్బతీశాయి. ఎక్కడా తెలుగుదేశం పార్టీ [more]

;

Update: 2021-03-14 08:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మున్సిపల్ ఎన్నికలు కూడా కలసి రాలేదు. అన్ని జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని దారుణంగా దెబ్బతీశాయి. ఎక్కడా తెలుగుదేశం పార్టీ సరైన పనితీరును కనపర్చలేదు. ఒక్క జిల్లా అంటూ లేదు.. ఒక ప్రాంతం అంటూ లేదు. ఏరియాలకు ఏరియాల్లోనే చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి ఘోరమైన ఫలితాలు రావడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది.

భ్రమలను కల్పించి…..

పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను భయభ్రాంతులను చేశారని చంద్రబాబు ప్రజల్లో భ్రాంతి కలిగించబోయారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగడంతో దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పార్టీ సింబల్ మీద జరిగాయి. కొంచెం నాయకత్వం గట్టిగా ఉన్న చోట మాత్రమే చంద్రబాబు పార్టీ కొద్దో గొప్పో వార్డులను గెలుచుకోగలిగింది. చంద్రబాబు గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్ లలో ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు గుంటూరు, కర్నూలు కార్పొరేషన్లలో టీడీపీ ఘోర ఓటమిని చవి చూసింది.

అసంతృప్తి ఉందన్న అంచనాతో…..

అమరావతి రాజధాని, పెట్టుబడులు రాష్ట్రానికి రాకపోవడం, నిరుద్యోగం, అరాచక పాలన పైనే చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. జగన్ పాలన రెండేళ్లలో పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత కన్పించిందన్న అంచనా వేశారు. ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకపోవడం వైసీపీకి మైనస్ గా మారుతుందని చంద్రబాబు భావించారు. మున్సిపల్ ఎన్నికల్లో నాయకత్వ లోపం తీవ్రంగా కన్పించింది.

బలమైన నాయకులున్న చోట….

తాడిపత్రి, హిందూపురం, అద్దంకి వంటి చోట్ల బలమైన నాయకత్వం ఉన్నందున అక్కడ కొంత మెరుగైన పనితీరును కనపర్చిన తెలుగుదేశం పార్టీ మిగిలిన మున్సిపాలిటీల్లో పడకేసింది. చంద్రబాబు పార్టీ రాష్ట్ర కమిటీని, పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికలు చంద్రబాబు షాకిచ్చాయనే చెప్పాలి. ప్రస్తుతం చంద్రబాబుకు ఓటమి పై రివ్యూ చేసుకోవడం మినహా అధికార పార్టీపై ఇన్నాళ్లూ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే దాదాపుగా రిపీట్ అయ్యాయనే చెప్పాలి.

Tags:    

Similar News