బాబుకు సీఎం అయ్యే ఛాన్స్ అప్పుడే?

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి అనేక కారణాలున్నాయి. ఇందులో సంక్షేమ పథకాలు అమలు అని వేరుగా చెప్పనవసరం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు వితండ వాదాన్ని [more]

;

Update: 2021-03-29 13:30 GMT

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి అనేక కారణాలున్నాయి. ఇందులో సంక్షేమ పథకాలు అమలు అని వేరుగా చెప్పనవసరం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు వితండ వాదాన్ని తెరపైకి తెచ్చారు. తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపి వేస్తామని ఓటర్లను బెదిరించినందునే తాము ఓటమి పాలయ్యామని టీడీపీ నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తమ ఓటమిపై లోతుగా విశ్లేషణ జరపుకోకుండా వైసీపీ అరాచకాలపైనే ఎక్కువగా టీడీపీ విమర్శలు చేస్తుంది.

ఎప్పుడు ఎన్నికలొచ్చినా…..

నిజానికి సంక్షేమ పథకాలను నిలిపేస్తామన్న హెచ్చరికలతోనే వైసీపీకి ఓటు వేశారనుకుందాం. అది ఈ ఎన్నికతోనే ఆగదు కదా? ఏ ఎన్నికల్లోనైనా ఇదే పద్ధతిని వైసీపీ అనుసరిస్తుంది. సాధారణ ఎన్నికల్లో సయితం తాము వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని, చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ములు కూడా రావన్న ఓటర్లను చంద్రబాబు ఎలా మార్చుకుంటారు?

కబుర్లకు కాలం చెల్లింది……

అంటే సంక్షేమ పథకాల అమలే రానున్న ఏ ఎన్నికల్లోనైనా చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారనున్నాయి. దీనిపై ఆయన లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. తాను అమలు చేసిన పథకాలను జగన్ నిలిపివేశారని చంద్రబాబు చెప్పే కబుర్లకు ఇక కాలం చెల్లింది. ఎందుకంటే చంద్రబాబు హయాంలో కంటే ఎక్కువ సంఖ్యలో సంక్షేమ పథకాలకు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. అందుకే చంద్రబాబు సంక్షేమ పథకాల వాదనకు తెరదించాల్సి ఉంటుంది.

నమ్మకం కల్గిండమొక్కటే మార్గం….

తాను మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తానని చంద్రబాబు చెబితేనే ప్రజలు కొంత నమ్ముతారు. అలాగే పార్టీకి ఉపయోగకరంగా ఉంటుంది. హైదరాబాద్ ను నేనే కట్టాను. రాజధాని అమరావతిని సింగపూర్ లా మారుస్తానంటే జనానికి పట్టదు. మరోసారి ఘోర ఓటమిని చవిచూడాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు ఇప్పటికైనా తన పంథాను మార్చుకోవాల్సి ఉంటుంది. సానుభూతి కోసం ప్రయత్నించడమూ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వృధా ప్రయాసే. చంద్రబాబు ప్రజలకు నమ్మకం కల్గించితేనే మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News