మెజారిటీ తగ్గించినా చాలట.. అందుకే నమ్మకమైన నేతలను?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన సొంత జిల్లా నేతలను నమ్మడం లేదా? వారిని నమ్ముకుంటే రాజకీయం చేయాలని భావించారా? అంటే అవుననే అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో [more]
;
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన సొంత జిల్లా నేతలను నమ్మడం లేదా? వారిని నమ్ముకుంటే రాజకీయం చేయాలని భావించారా? అంటే అవుననే అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో [more]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన సొంత జిల్లా నేతలను నమ్మడం లేదా? వారిని నమ్ముకుంటే రాజకీయం చేయాలని భావించారా? అంటే అవుననే అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో చంద్రబాబు ఇటీవల పర్యవేక్షక కమిటీని నియమించారు. వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఈ కమిటీలో చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఎవరూ లేకపోవడం విశేషం. ఇదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.
ప్రతిష్టాత్మకంగా….
తిరుపతి ఉప ఎన్నికను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తిరుపతిలో గెలవడం మాట అటుంచినా వైసీపీ మెజారిటీ తగ్గిస్తే చాలునన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. వైసీపీ అభ్యర్థి మెజారిటీని గణనీయంగా తగ్గించినా సగం విజయం టీడీపీ సాధించినట్లేనన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ఆ దిశగా నిత్యం చంద్రబాబు తిరుపతి పార్లమెంటు పరధిలోని నేతలతో సమావేశం అవుతున్నారు.
పర్యవేక్షక కమిటీని…..
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కోసం చంద్రబాబు పర్యవేక్షక కమిటీని నియమించారు. ఇందులో నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పనబాక కృష్ణయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలో ఒక్క చిత్తూరు జిల్లాకు చెందిన వారు కూడా లేకపోవడం విశేషం. ఇటీవల కాలంలో వరస ఓటములు, కుప్పంలోనూ పంచాయతీలు కోల్పోవడం వంటి కారణాలతో చిత్తూరు జిల్లా నేతలను చంద్రబాబు నమ్మడం లేదంటున్నారు.
చిత్తూరు జిల్లా నేతలను….?
నిజానికి సొంత జిల్లా కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు చంద్రబాబు ఆ జిల్లా నేతలకు పెద్దయెత్తున పార్టీ నిధులు పంపారట. అయితే వాటిని ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం వహించారని చంద్రబాబు గుర్తించారు. తిరుపతి ఎన్నికల్లోనూ నిధుల పంపకానికి వీరిని దూరంగా ఉంచాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుకే పర్యవేక్షక కమిటీలో చిత్తూరు జిల్లా నేతలకు చోటు కల్పించలేదు. తిరుపతి పార్లమెంటు పరిధిలో శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మాజీ మంత్రులున్నారు. కానీ వీళ్లెవ్వరికీ బాధ్యతలను చంద్రబాబు అప్పగించకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.