జూనియర్ ను దగ్గరకు కూడా రానివ్వరట

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక సినిమా నటులకు కాలం చెల్లినట్లే. ఎన్టీరామారావు తర్వాత ఆ తరహా ప్రభావం చూపే సినీనటులు ఇప్పట్లో లేకపోవడం ఒక కారణం. మరోవైపు మెగాస్టార్ [more]

Update: 2021-04-06 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక సినిమా నటులకు కాలం చెల్లినట్లే. ఎన్టీరామారావు తర్వాత ఆ తరహా ప్రభావం చూపే సినీనటులు ఇప్పట్లో లేకపోవడం ఒక కారణం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ వంటి చరిష్మా ఉన్నా ఆయన రాజకీయాల్లో రాణించలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు ఇదే విషయాన్ని నేతలకు పదే పదే చెబుతున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలన్న వత్తిడి పెరుగుతుండటంతో చంద్రబాబు ప్రతి సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిసింది.

అవును వచ్చి…..

నిజమే చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టగానే ఊపేస్తారనుకున్నారంతా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి పార్టీ కేవలం పద్ధెనిమిది స్థానాలకే పరిమితమయింది. ఇక ఆతర్వాత వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి అయితే మరీ దారుణం. ఒక్కటంటే ఒక్క సీటును ఆయన గెలుచుకున్నారు. పోటీ చేసిన రెండుచోట్ల పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారు.

తెచ్చి కష్టాలను…..

ఈ ఉదాహరణలు చాలవా? జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకు రాకపోవడానికి. చంద్రబాబు ఫక్తు రాజకీయ వేత్త. తన కుమారుడికే రాజకీయ వారసత్వం లభించాలని సహజంగా భావిస్తారు. అలాంటిది ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉందని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ను తెచ్చి ఎందుకు కొరివితో తలగోక్కుంటారన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినంత మాత్రాన ఇప్పటికిప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.

ఆయన వల్ల ఒరిగేదేమీ లేదని….

2024 ఎన్నికల్లోనూ టీడీపీని గెలిపించగల సత్తా ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని అనుకోవడం భ్రమే అవుతుంది. ఎందుకంటే గతంలోనూ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. 2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోయినా పార్టీ అధికారంలోకి వచ్చింది. దీన్ని బట్టి జూనియర్ ను చంద్రబాబు ఎందుకు పార్టీలోకి తీసుకు వస్తారు? ఎందుకు అందలమెక్కిస్తారు. ఇదంతా ట్రాష్ గా టీడీపీ సీనియర్ నేతలు కొట్టి పారేస్తున్నారు. తన తాత పార్టీకి మద్దతు తెలపాలంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఏ ఎన్నికల ప్రచారంలోనైనా పాల్గొనవచ్చని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశేషం.

Tags:    

Similar News