బాబుకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదట

టీడీపీకి నాలుగు దశాబ్దాలు పూర్తి అవుతున్నాయి. అంటే టీడీపీ ఇపుడు యవ్వనంలో లేదు అన్న మాట. నడి వయసుకు వచ్చేసినట్లే. ఒక విధంగా సీనియారిటీని సాధించినట్లే. ఇవన్నీ [more]

Update: 2021-03-30 08:00 GMT

టీడీపీకి నాలుగు దశాబ్దాలు పూర్తి అవుతున్నాయి. అంటే టీడీపీ ఇపుడు యవ్వనంలో లేదు అన్న మాట. నడి వయసుకు వచ్చేసినట్లే. ఒక విధంగా సీనియారిటీని సాధించినట్లే. ఇవన్నీ క్రెడిట్లు అనుకుంటే మరో వైపు టీడీపీ వృద్ధ పార్టీ అవుతోంది అన్న మాట కూడా ఒక రకమైన మైనస్ గా వినిపిస్తోంది. టీడీపీకి నలభయేళ్ళ వయసు ఉంటే పార్టీలో నాడు యువకులుగా చేరిన వారంతా ఇపుడు ముసలి వారు అయిపోయారు. చిత్రమేంటంటే వారే ఇపుడు తెలుగు రాజకీయ తెర మీద ఇంకా కనిపిస్తున్నారు.

ఎన్టీయార్ అలా….

ఇక తెలుగుదేశం పార్టీలో ఒక యాంటీ సెంటిమెంట్ ఉంది. అదే వెన్నుపోట్లు. అలాగే మరోటి కూడా ఉంది. అది బంధుప్రీతి. ఎన్టీయార్ తాను సన్యాసిని అంటూనే మొదట కుమారుడు బాలక్రిష్ణను వారసుడు అన్నారు. తరువాత రెండవ కళ‌త్రం లక్ష్మీపార్వతిని తన వారసురాలిగా చేయబోయారు. మొదటిది ఇంటి గొడవే కాబట్టి లైట్ గానే సెటిల్మెంట్ అయింది. రెండవ దానికి మాత్రం కాస్తా గట్టిగానే ఆపరేషన్ చేయాల్సివచ్చింది. ఈ దెబ్బకు ఎన్టీయార్ సీఎం సీటుతో సహా మొత్తం పార్టీనే కోల్పోయారు. అయితే ఆ పని చేసిన వారు కూడా అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులే. అలా తాను పెట్టిన పార్టీయే అన్న గారి పుట్టె ముంచేసింది.

పుత్ర ప్రేమలో ….

ఇక ఇపుడు చంద్రబాబు కూడా పుత్ర ప్రేమలో తరిస్తున్నారు. ఆయనకు తాను తన కొడుకు తప్ప మరెవరూ పార్టీగా కనిపించడంలేదు. ఎన్టీయార్ నుంచి అధికారం, పార్టీని తీసుకున్నా కూడా చంద్రబాబు టీడీపీని పాతికేళ్ళకు పైగా మనుగడలో ఉంచగలిగారు. మరి ఆయన కుమారుడు లోకేష్ కి ఆ శ‌క్తి, యుక్తీ ఉన్నాయా అన్నదే ఇక్కడ పెద్ద డౌట్. అదే సమయంలో తెలుగుదేశంలో కొత్త నాయకత్వం కావాలని సీనియర్ నేత, మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి లాంటి వారు తాజాగా బాంబు పేల్చారు. ఆయన జూనియర్ ఎన్టీయార్ ని కూడా పార్తీ కోసం పనిచేయమంటున్నారు. ఈ రెండింటినీ కలిపి చూస్తే పెదబాబు, చినబాబులకే పార్టీలో ఎసరు తప్పదా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది.

సాధ్యమేనా…?

తెలుగుదేశం పార్టెలో ఇప్పటికిపుడు చంద్రబాబుని కాదని ముందుకు వచ్చేవారు ఎవరూ లేరు. టీడీపీ అంటేనే బాబు, బాబు అంటేనే టీడీపీ. అలా పార్టీని ఏనాడో ఏకశిలా సదృశ్యంలా బాబు మార్చేశారు. కానీ కాలం ఎపుడూ ఒకేలా ఉండదు, జూనియర్ ఎన్టీయార్ తన సినీ కెరీర్ వదులుకు టీడీపీ వైపు రాకపోవచ్చు. కానీ టీడీపీ ఇదే రకమైన స్థితిలో ఉంటే మాత్రం ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బలమైన సామాజికవర్గమే కొత్త నాయకత్వాన్ని సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నదే ఇపుడు ప్రచారంలో ఉన్న మాట. మొత్తానికి నాడు ఎన్టీయార్ ఇదే రకమైన వారసత్వపు గొడవల్లో పడి పార్టీని కోల్పోయారు. ఇపుడు బాబు కూడా కుమారుడి కోసం పార్టీని వదిలే సీన్ ఉంటుందా. అంటే ఏమో చూడాల్సిందే.

Tags:    

Similar News