సీనియర్లు వదలరు.. జూనియర్లు కదలరు.. బాబుకు తలనొప్పి
నిజమే! టీడీపీలో ఈ ఆవేదన ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. దాదాపు పార్టీ అధికారంలోకి వచ్చిన 2014-16 సంవత్సరాల మధ్య జోరుగా సాగింది. అయితే.. అప్పట్లో పార్టీ [more]
నిజమే! టీడీపీలో ఈ ఆవేదన ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. దాదాపు పార్టీ అధికారంలోకి వచ్చిన 2014-16 సంవత్సరాల మధ్య జోరుగా సాగింది. అయితే.. అప్పట్లో పార్టీ [more]
నిజమే! టీడీపీలో ఈ ఆవేదన ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. దాదాపు పార్టీ అధికారంలోకి వచ్చిన 2014-16 సంవత్సరాల మధ్య జోరుగా సాగింది. అయితే.. అప్పట్లో పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ అధినేత కూడా లైట్ తీసుకున్నారు. తాము చేస్తున్న అభివృద్ధిని , తనను చూసి ప్రజలు గెలిపిస్తారని అనుకున్నారు.కానీ, అనూహ్యంగా పార్టీ ఓడిపోయింది. దీనికి తోడు వైసీపీ సర్కారు ఏర్పడిన తర్వాత.. పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. రేపు తిరుపతి ఉప ఎన్నిక తర్వాత కూడా పార్టీ నుంచి వలసలు పెరిగే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై చర్చిస్తున్నారు.
యువరక్తం ఎక్కించడమంటే?
తాజాగా ఈ విషయం చర్చకు రాగానే పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు ఒక ప్రతిపాదన వచ్చింది. యువతకు ప్రాధాన్యం పెంచండి అని… అయితే.. ఆయన ఇప్పటికే పెంచాం కదా.. ఇప్పుడు కొత్తగా చేసేది ఏముంటుంది? అని ప్రశ్నించారని తెలిసింది. దీనికి కొందరు సమాధాన మిస్తూ.. పదవులు అయితే.. ఇచ్చారు సార్.. కానీ వారికి వాయిస్ ఇవ్వలేదు! అని జవాబు చెప్పారట. అంటే.. పార్టీలోకి యువ రక్తం ఎక్కించడం అంటే.. పదవుల్లో యువతను కూర్చోబెట్టడం మాత్రమేనని ఇప్పటి వరకు చంద్రబాబు భావిస్తూ వచ్చారు. కానీ, అలా కాదని.. వారికి కూడా కొన్ని అధికారాలు వెసులుబాట్లు.. మీడియా ప్రతినిధులుగా మాట్టాడే ఛాన్స్ ఇవ్వాలని కొందరు విన్నవించారు.
సీనియర్లే చుట్టూ ఉంటూ…..
దీంతో ఒక్కసారిగా ఇదో చిత్రమైన విషయం అంటూ.. చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. నిజమే ఇప్పటి వరకు పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పిన చంద్రబాబు.. వారికి పదవులు ఇచ్చారు. కానీ, వాయిస్ మాత్రం ఇప్పటికీ సీనియర్ల వద్దే ఉంది. మాజీమంత్రులు, కురువృద్ధ నేతలు మాత్రమే పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. ఇంకా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలే చంద్రబాబు చెవిలో జోరిగల్లా ఉన్నారు. పార్టీ చాలా వరకు దెబ్బతినడానికి వీరి నిర్ణయాలే అని పలువురు మొత్తుకుంటున్నా కూడా చంద్రబాబు ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు.
విలువ లేకపోవడంతో….
దీంతో పదవులు ఇచ్చినా తమ మాటకు విలువ లేకపోవడంతో యువత కేవలం నోరెళ్లబెట్టి చూస్తోంది. ఈ విధానం మారాల్సిన అవసరం ఉందనేది నేటి యువత అడుగుతున్న ప్రశ్న. సో.. వారికి కూడా వాయిస్ వినిపించే అవకాశం. మీడియాలో కనిపించే అవకాశం ఇవ్వడం ద్వారానే ఉత్సాహం రెట్టింపు అవుతుందని.. ఆదిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మరి ఇది ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.