ఈ ప్రశ్నలకు బాబు దగ్గర ఆన్సర్ లేదట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్. ఆయనకున్న వ్యూహాలు, తెలిసిన ఎత్తులు ఎవరికీ తెలియవు. రాజకీయాల్లో రాటు దేలిన చంద్రబాబు మేనేజ్ చేయడంలోనూ [more]

;

Update: 2021-04-17 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్. ఆయనకున్న వ్యూహాలు, తెలిసిన ఎత్తులు ఎవరికీ తెలియవు. రాజకీయాల్లో రాటు దేలిన చంద్రబాబు మేనేజ్ చేయడంలోనూ ఘనాపాఠి. అయితే 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు వ్యూహాలన్నీ చిత్తవుతున్నాయి. ఏదీ కలసి రావడం లేదు. దీంతో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు తప్పుడివిగా పార్టీ నేతలే వ్యాఖ్యానించాల్సిన దుస్థితి ఏర్పడింది.

బహిష్కరణ నిర్ణయం…..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించి చంద్రబాబు సరిదిద్దుకోలేని తప్పు చేశారనడం వాస్తవం. క్యాడర్ లో చంద్రబాబు బలహీన మైన నేత అని ముద్రపడేందుకు ఈ నిర్ణయం కారణమయిందని చెప్పాలి. ఎన్నికల బహిష్కరణకు చంద్రబాబు చెబుతున్న సాకులు, కారణాలు కూడా క్యాడర్ నమ్మడం లేదు. ఎన్నికల కమిషనర్ పై నమ్మకం లేకపోవడం, వైసీపీ అధికార దుర్వినియోగం వంటివి కంటితుడుపుగా చెబుతున్న మాటలే.

బలహీనమైన నేతగా…..

ఇప్పుడే ఇలా ఉంటే సాధారణ ఎన్నికలకు వైసీపీని చంద్రబాబు ఎలా తట్టుకుంటారని క్యాడర్ నుంచే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేవలం మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసి ఈ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్ లో ఏ ఎన్నికకయినా క్యాడర్ నుంచి ఎలా మద్దతు లభిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందే అనేక ఎన్నికలు రావచ్చు. రాకపోవచ్చు. అప్పుడు చంద్రబాబు వాటిని ఎలా ఎదుర్కొంటారని కొందరు సీనియర్ నేతలు సయితం అంతర్గత సంభాషణల్లో అంటుండటం విశేషం.

తెలంగాణలో పోటీ ఎలా?

ఏమీ లేని తెలంగాణలో అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుండటాన్ని కూడా ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జీరో ప్లేస్ వచ్చినా, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల స్థానంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పోటీ చేశారు. నాగార్జున సాగర్ లోనూ టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఇలా పొరుగు రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లో పాల్గొంటున్న టీడీపీని చంద్రబాబు ఇక్కడ బలమైన క్యాడర్ ఉన్నా ఎందుకు వెనక్కు తగ్గారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది చంద్రబాబు బలహీనతకు నిదర్శనమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News