పరిషత్‌పై బాబు ఎత్తుగడ.. సక్సెస్ అయినట్లేనా ?
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన టీడీపీ ఎన్నికల బహిష్కరణ అంశం.. చంద్రబాబు వేసిన ఎత్తుగడేనా ? తన పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోటీ [more]
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన టీడీపీ ఎన్నికల బహిష్కరణ అంశం.. చంద్రబాబు వేసిన ఎత్తుగడేనా ? తన పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోటీ [more]
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన టీడీపీ ఎన్నికల బహిష్కరణ అంశం.. చంద్రబాబు వేసిన ఎత్తుగడేనా ? తన పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకొంటోందని, ఎన్నికలను బహిష్కరిస్తోందని ఆయన చేసిన ప్రకటన వెనుక చాలా వ్యూహం దాగి ఉందా? అంటే.. ఔననే అంటున్నారుపరిశీలకులు. ప్రస్తుతం టీడీపీపై ప్రజల్లో సింపతీ పవనాలు అడు గంటాయి. నిజానికి చంద్రబాబు రాజకీయాల్లో నమ్ముకున్నది రెండే రెండు అంశాలు. ఒకటి సీనియర్లు, రెండు సింపతీ. సీనియర్లు ఎప్పుడో చేతులు ఎత్తేశారు. ఇదే 2019లో పార్టీని ఘోరంగా దెబ్బతినేలా చేసింది. జనాల్లో ఫేడవుట్ అయిపోయిన సీనియర్ల సలహాలనే నమ్ముకున్న చంద్రబాబు చివరకు తాను కూడా ఫేడవుట్ అవ్వాల్సిన పరిస్థితి. ఇక, సింపతీ కూడా అప్పట్లో వర్కవుట్ కాలేదు.
మీ కోసం వస్తున్నా అంటూ…..
“నాకు అన్నీ ఉన్నాయ్. అయినా.. మీ కోసం రోడ్డు మీదకు వచ్చాను నేరస్తులతో (జగన్ పార్టీ) పోటీ చేస్తున్నాను. అంతా మీకోసం.. అన్నీ మీ కోసం“ అంటూ.. ఆయన చేసిన ప్రకటన కూడా వర్కువుట్ కాలేదు. అయినప్పటికీ.. ఇప్పటికీ ఆయన సింపతీనే నమ్ముకున్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సింపతీనే నమ్ముకున్నారు. ఇదీ వర్కవుట్ కాలేదు. అయితే.. ఈ సింపతీలోనే రెండో కోణాన్ని తెరమీదికి తెచ్చారు. అదే ఎన్నికల బహిష్కరణ. ఇప్పుడు నిజంగానే చంద్రబాబు చేసిన ప్రయత్నం.. మేధావి వర్గాల్లోనూ చర్చకు వచ్చింది. ఎందుకు ఆయన పోటీ నుంచి తప్పుకొన్నారు ? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
చర్చగా మారడంతో….
దీంతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు.. అధికార దుర్వినియోగం వంటివి మేధావి వర్గాల మధ్య చర్చ నడుస్తున్నాయి. ఇదే విషయం సోషల్ మీడియాలోనూ ప్రధానంగా చర్చకు వస్తోంది. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఎన్నికలను బహిష్కరించి ప్రజల్లోకి వెళ్లి సింపతీ పొందారు. ఇదే సూత్రాన్ని చంద్రబాబు ఎత్తుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పుంజుకుంటుందని.. ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో నైరాశ్యం ఏర్పడిన నేపథ్యంలో నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు కూడా ఇది పనిచేస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బహిష్కరణ సింపతీని చంద్రబాబు ఎంచుకుని ఉంటారని అంటున్నారు. మరి ఇది వర్కవుట్ అయితే.. మంచిదే.. లేకపోతే.. మాత్రం మొదటికే మోసం వస్తుందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే పతనా వస్థలో పార్టీని మరింత పాతాళంలోకి నెట్టేసినట్టే అవుతుంది.