కొన్నాళ్లు నేస్తం.. కొన్నాళ్లు వైరం.. బాబు ప్రభావం తగ్గిందా ?
“నేను జాతీయ స్థాయిలో చక్రం తిప్పాను. అనేక మందిని జాతీయస్థాయిలో నిలబెట్టాను. అనేక మందిని ప్రధాని అయ్యేలా ప్రోత్స హించాను. పేర్లు సైతం సూచించాను“ అని సగర్వంగా [more]
;
“నేను జాతీయ స్థాయిలో చక్రం తిప్పాను. అనేక మందిని జాతీయస్థాయిలో నిలబెట్టాను. అనేక మందిని ప్రధాని అయ్యేలా ప్రోత్స హించాను. పేర్లు సైతం సూచించాను“ అని సగర్వంగా [more]
“నేను జాతీయ స్థాయిలో చక్రం తిప్పాను. అనేక మందిని జాతీయస్థాయిలో నిలబెట్టాను. అనేక మందిని ప్రధాని అయ్యేలా ప్రోత్స హించాను. పేర్లు సైతం సూచించాను“ అని సగర్వంగా చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు.. అదే జాతీయ స్థాయిలో ఒంటరయ్యారా? ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదా? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో రాజకీయ సమీ కరణలు మారుతున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు నిప్పులు చెరుగుతున్నాయి. దీంతో మోడీకి వ్యతిరేకంగా పావులు కదపాలని నిర్ణయించుకున్నాయి.
బీజేపీకి వ్యతిరేకంగా…..
మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి.. అంటే 2024 నాటికి ప్రత్యేక కూటమిగా ఏర్పడి.. మోడీని నిలువరించి.. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీని ఢిల్లీ గద్దె ఎక్కించాలని భావిస్తున్నాయి. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇన్షియేట్ తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రాలకు లేఖలు కూడా రాశారు. రండి.. మోడీని గద్దె దింపేద్దాం.. అంటూ.. ఆమె పిలుపు కూడా ఇచ్చారు. అయితే.. దీనికి ఇప్పుడు.. జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అడ్డంకిగా ఉన్నాయి. వీటి ఫలితాలను బట్టి.. త్వరలోనే మోడీపై యుద్ధం ప్రకటించేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు జాతీయ స్థాయిలో వెలువడుతున్నాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఒక్క రాజకీయ పక్షాలే కాదు.. మేధావి వర్గాలు, కార్మిక, రైతు సంఘాలు.. కూడా ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా మారాయి.
ఏమీ కన్పించడం లేదా?
ఒకప్పుడు కేంద్రంలోని ప్రభుత్వాన్ని.. లేదా పార్టీని.. ప్రత్యర్ధి పార్టీలు మాత్రమే వ్యతిరేకించగా.. ఇప్పుడు మోడీకి ఒక్క కార్పొరేట్ శక్తులు మినహా అన్ని వర్గా లనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మమత వంటి నాయకురాలు.. మంచి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో చక్రం తిప్పానని చెప్పుకొనే చంద్రబాబు పరిస్థితి ఏంటి ? అంటే.. ఏమీ కనిపించడం లేదు. దీనికి కారణం.. జాతీయ పార్టీలైన బీజేపీతోను, కాంగ్రెస్‌తోను.. ఆయన కొన్నాళ్లు చెలిమి చేశారు. తర్వాత కయ్యం పెట్టుకున్నారు. ఇప్పుడు న్యూట్రల్‌గా ఉన్నారు. దీంతో ఆయా పార్టీలు ఏవీ కూడా బాబును నమ్మడం లేదు.
చేసుకున్న వారికి…..
ఇంకా అవసరమైతే.. జగన్‌ను నమ్మేందుకు మమత ముందుకు వచ్చారు కానీ.. చంద్రబాబును మాత్రం నమ్మక పోవడం గమనార్హం. దీనిపై జాతీయ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోనూ మేధావులు నోరు విప్పారు. చంద్రబాబుకు సరైన స్టాండ్ లేదని.. ఎప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. తెలియని పరిస్థితి ఉందని అందుకే .. ఒకప్పుడు జాతీయస్థాయిలో ఆయనను సమర్ధించిన ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్ వంటివారు కూడా ఇప్పుడు పట్టించుకోవడం లేదని.. అంటున్నారు. అంటే.. మొత్తానికి చంద్రబాబు చేసుకున్న స్వయంకృతం .. ఆయనను జాతీయ నేతగా దిగజార్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం. మరి ఈ పరిస్థితి మారుతుందా? మారదా? చూడాలి.