జగన్ పై పోరాటానికి “ఉమ్మడి” వ్యూహాన్ని సిద్ధం చేశారట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు. అలాగని బలహీనమైన కమ్యినిస్టు పార్టీలతో కలసి కూడా ఆయన ప్రయాణించరు. ఇటీవల [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు. అలాగని బలహీనమైన కమ్యినిస్టు పార్టీలతో కలసి కూడా ఆయన ప్రయాణించరు. ఇటీవల [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు. అలాగని బలహీనమైన కమ్యినిస్టు పార్టీలతో కలసి కూడా ఆయన ప్రయాణించరు. ఇటీవల సీపీఐ టీడీపీ పట్ల కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ చంద్రబాబు చివరి నిమిషంలో వామపక్ష పార్టీలను పక్కన పెట్టే అవకాశముంది. మరోసారి బీజేపీ, జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తేనే విజయం దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.
ఇప్పటి నుంచే సిద్ధం…..
అందుకోసం చంద్రబాబు ఇప్పటి నుంచే కొంత ప్రిపేర్ అవుతున్నట్లు కన్పిస్తుంది. నియోజకవర్గాల ఇన్ ఛార్జుల విషయంలోనూ చంద్రబాబు సీరియస్ గా లేకపోవడానికి కారణమిదేనంటున్నారు. బీజేపీ, జనసేనతో కలసి పోటీ చేస్తే దాదాపు యాభైకి పైగా స్థానాలను టీడీపీ వదులుకోవాల్సి ఉంటుంది. అంటే దాదాపు వంద స్థానాల్లోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబు ఇటీవల నిర్ణయాలు ఉన్నాయంటున్నారు.
సర్వే చేయించడానికి…..
ఇప్పటికే చంద్రబాబు సర్వే చేయాలని ఒక ప్రయివేటు సంస్థకు అప్పగించారని తెలుస్తోంది. మూడు పార్టీలు కలిస్తే విజయం సాధించే నియోజకవర్గాలపై ఈ సర్వే చంద్రబాబు స్పెషల్ గా చేయిస్తున్నారని తెలిసింది. నేతలు రెండేళ్ల నుంచి యాక్టివ్ గా లేకపోవడం, వారిని చంద్రబాబు పట్టించుకోక పోవడం కూడా ఇదే కారణమని చెబుతున్నారు. బీజేపీతో సయోధ్య కోసం ఇప్పటికే ఢిల్లీలో లాబీయింగ్ ను చంద్రబాబు ప్రారంభించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీలో లాబీయింగ్…..
జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా ఎదుర్కొనలేమని చంద్రబాబుకు తెలియంది కాదు. అయితే బీజేపీ తనను దగ్గరకు రానివ్వకుండా కొందరు రాష్ట్ర నేతలు అడ్డుకుంటున్నారు. వీరిని పక్కన పెట్టి నేరుగా ఢిల్లీ నేతలతోనే చంద్రబాబు టచ్ లోకి వెళ్లారంటున్నారు. చంద్రబాబుకు చెందిన ఒక టీం ఇప్పటికే ఢిల్లీలో ప్రయత్నాలు ప్రారంభించిందట. అన్నీ వీలయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ఢిల్లీ టూర్ ఉండే అవకాశముందని కూడా తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు జగన్ పై పోరాటానికి ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేశారంటున్నారు.