కష్టాలు…నష్టాలు పెరగడమే తప్ప తగ్గేట్లు లేవే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాను రాను కష్టాలు తప్పవంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడం, పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ద్వితీయస్థాయి క్యాడర్ సయితం పార్టీకి [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాను రాను కష్టాలు తప్పవంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడం, పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ద్వితీయస్థాయి క్యాడర్ సయితం పార్టీకి [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాను రాను కష్టాలు తప్పవంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడం, పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ద్వితీయస్థాయి క్యాడర్ సయితం పార్టీకి దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఎన్నికలు లేవు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, పరిషత్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభావం ఏమీ లేకపోవడంతో ఎవరూ గెలవలేకపోయారు.
అనేక మంది బరిలో నిలిచి…..
పార్టీ నుంచి ఆర్థిక సహకారం లభించకపోయినా పార్టీ కోసం అనేక మంది బరిలో నిలిచారు. సొంత సొమ్ములు వెచ్చించి మరీ పోటీ చేశారు. కానీ అన్నిరకాలుగా వారికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. దీంతో ద్వితీయ శ్రేణి క్యాడర్ కూడా పార్టీకి దూరమవుతారనే సంకేతాలు వెలువడుతున్నాయి. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులే సైలెంట్ అయిపోయారు. పార్టీని పక్కన పెట్టి తమ వ్యాపారాలను చూసుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.
పార్టీని కాపాడింది వారే….
నిజానికి ఈ రెండేళ్ల నుంచి పార్టీని ఒకరకంగా కాపాడింది ద్వితీయ శ్రేణి నేతలే. చంద్రబాబు ఏ పిలుపు ఇచ్చినా కూడా అన్ని మండల కేంద్రాల్లో స్పందించిది ద్వితీయ శ్రేణి నేతలే. స్థానిక సంస్థల ఎన్నికలలో తమకు టిక్కెట్ వస్తుందని, తాము గెలిస్తే రాజకీయంగా ఎదగవచ్చన్న ఆశతో ఈ రెండేళ్లు సెకండ్ లెవల్ క్యాడర్ జెండాను వదలిపెట్టలేదు. ఇక ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఇక ఏపదవులు లేవు. మన దరికి వచ్చే అవకాశం లేదని భావించిన ద్వితీయ శ్రేణినేతలు పక్క చూపులు చూస్తున్నారు.
పక్క చూపులు చూస్తున్న…..
చంద్రబాబు తొలి నుంచి నమ్ముకున్నది ద్వితీయ శ్రేణి నేతలనే. వారే పార్టీని కష్టకాలంలోనూ ఆదుకుంటూ వస్తున్నారు. జగన్ ప్రభుత్వం స్థానికసంస్థల ఎన్నికలన్నింటీని పూర్తి చేయడం, అందులో టీడీపీ చతికలపడటంతో వారు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఇప్పటికే అనేక మంది నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. మరో మూడేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉండటం, ఐదేళ్ల పాటు స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడమ ఇందుకు కారణం. దీంతో రాను రాను చంద్రబాబుకు నేతలను కాపాడుకోవడం కష్టంగా మారుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.